Draupadi Murmu: పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేద్కర్‌ది కీలకపాత్ర: ద్రౌపది ముర్ము
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:49 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరంలో ఇవాళ(శుక్రవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
హైదరాబాద్, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) భాగ్యనగరంలో ఇవాళ(శుక్రవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ మంత్రి సీతక్క. రాష్ట్రపతి నిలయం నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు.
అక్కడ నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము, మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ పర్యటనలో ముర్ము వెంట మంత్రి సీతక్క ఉండనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.
నియామకాల అంశంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని తెలిపారు. 1950 తర్వాత UPSC, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరిగతిన పరిష్కారం అవసరమని తెలిపారు. నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
రామ్ సుతార్ మృతి శిల్ప కళకు తీరని లోటు: కేసీఆర్
Read Latest Telangana News and National News