Kavitha: సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:00 AM
సింగరేణి కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణతో మణుగూరు మనుగడ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వాపోయారు. సింగరేణి కార్మికుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు కవిత.
ఇవాళ(శుక్రవారం) మణుగూరు సింగరేణి పీకేఓసీ-2లో కవిత పర్యటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాట్రాక్టు మహిళా కార్మికులతో టిఫిన్ చేశారు కవిత. ఫిట్ మీటింగ్‌లో సింగరేణి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కవిత.
సింగరేణి మీద ఆధారపడి 70 వేలమంది ప్రజలు జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. మణుగూరులో సింగరేణి మనుగడ 3 సంవత్సరాలేనని సింగరేణి సీఎండీ చెప్పారని గుర్తుచేశారు. పీకేఓసీ- 2మైన్‌ని ప్రైవేట్ పరం చేయకుండా సింగరేణికే ఉంచాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి హెచ్ఎంఎస్‌తో కలిసి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News