ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Digital passport: చిప్ పాస్‌పోర్ట్ లాంచ్ చేసిన ఇండియా.. ఫీచర్లు, బెనిఫిట్స్ ఏంటి.. ఎలా పొందాలి..

ABN, Publish Date - May 14 , 2025 | 06:49 PM

India Chip Based E passport: భారతదేశ పాస్‌పోర్ట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు. తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన డిజిటల్ పాస్‌పోర్ట్ ద్వారా విదేశీ ప్రయాణం మరింత సులభం, సురక్షితం కానుంది. ఇంతకీ, చిప్ బేస్డ్ పాస్‌పోర్ట్ ఎందుకంత ప్రయోజనకరం? ఎలా పొందాలి? తదితర పూర్తి వివరాలు..

India Chip Based E passport

India E-passport Features: ఇండియాలో ఈ- పాస్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) వెర్షన్ 2.0 లో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిజిటల్ పాస్‌పోర్ట్ సేవలను ప్రారంభించింది. ఇది భారతదేశ పాస్‌పోర్ట్ వ్యవస్థలో ఆధునీకరణకు ప్రధాన అడుగు. దీని అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇందులో డిజిటల్ సంతకం చేసిన చిప్ ఉంటుంది. ఇది ఫోర్జరీ, నకిలీ పాస్‌పోర్ట్ లు, గుర్తింపు దొంగిలించిన వారిని ఇట్టే పట్టిస్తుంది. ఈ-పాస్‌పోర్ట్‌ల జారీతో వ్యక్తుల గుర్తింపు ధృవీకరణ మరింత సులభతరం, రక్షణాత్మకం కానుంది. నకిలీ గుర్తింపు అరికట్టి విదేశీ ప్రయాణాలను సౌకర్యవంతంగా మార్చే ఈ-పాస్‌పోర్ట్‌లలోని ప్రధాన ఫీచర్లు, ఉపయోగాలు, పొందే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?

ఈ-పాస్‌పోర్ట్ అనేది సాంప్రదాయ కాగితపు డాక్యుమెంటేషన్. ఇందులో వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ డేటా నిల్వ చేసే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్‌ను ఉపయోగిస్తారు. ఇది సాధారణ పాస్‌పోర్ట్ తో పోలిస్తే సురక్షితమైనది.


ఈ-పాస్‌పోర్ట్‌ను ఎలా గుర్తించాలి?

పాస్‌పోర్ట్ సింబల్ కింద ముద్రించిన బంగారు రంగు చిహ్నం ద్వారా ఈ-పాస్‌పోర్ట్‌ను గుర్తించడం చాలా సులభం.


ఈ-పాస్‌పోర్ట్‌ల ముఖ్య ప్రయోజనాలు?

  • మెరుగైన భద్రత: ఈ-పాస్‌పోర్ట్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో డిజిటల్ సంతకం చేసిన చిప్‌ ఉంటుంది. ఇది ఫోర్జరీ, పాస్‌పోర్ట్ నకిలీ, గుర్తింపు దొంగతనం ప్రమాదాలను నివారిస్తుంది.

  • డేటా రక్షణ: పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (PKI) చిప్ సున్నితమైన డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఇతరులు ఎవరూ ఇందులోని డేటాను యాక్సెస్ చేయలేరు. మార్చలేరు.

  • ప్రయాణ అనుభవం: చిప్ ఉండే పాస్‌పోర్ట్ వల్ల ధృవీకరణ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. మీ ప్రయాణం సజావుగా సాగేలా చేస్తుంది.


మీరు ఈ-పాస్‌పోర్ట్‌ను ఎక్కడ నుండి పొందవచ్చు?

ప్రస్తుతం, దేశంలో 13 నగరాల్లో ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తున్నారు. అవి - అమృత్‌సర్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, గోవా, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ. భారతదేశం అంతటా అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాలను కవర్ చేసే విధంగా ఈ-పాస్‌పోర్ట్‌ను దశలవారీగా అమలు చేయడానికి కొన్ని నెలలు పట్టవచ్చు.


ఈ-పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలా?

అయ్యే పాస్‌పోర్ట్ ఉన్నవారు కొత్త ఈ-పాస్‌పోర్ట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వర్గాల ప్రకారం, అథారిటీ జారీ చేసిన అన్ని పాస్‌పోర్ట్‌లు చెల్లుబాటులో ఉంటాయి.


Read Also: Colonel Sofiya Qureshi: కల్నల్ ఖురేషిపై వ్యాఖ్యలు.. మంత్రికి హైకోర్టు షాక్

Bhuvanewar: భారత ఓడరేవులో కలకలం.. నౌకలో 21 మంది పాకిస్థానీలు.. అధికారుల హై అలర్ట్..

Maoists: ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు లేఖ.. ఛత్తీస్‌ఘడ్ డీజీపీ ప్రెస్ మీట్

Updated Date - May 14 , 2025 | 07:56 PM