ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Novak Djokovic: చరిత్ర సృష్టించిన జొకోవిచ్.. 57 ఏళ్లలో ఇదే తొలిసారి!

ABN, Publish Date - Jun 05 , 2025 | 03:37 PM

సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. 57 ఏళ్లలో అరుదైన ఘనతను అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. మరి.. జొకోవిచ్ అందుకున్న ఆ ఫీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Novak Djokovic

ప్రముఖ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్-2025 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరాడు. 38 ఏళ్ల జొకోవిచ్.. అత్యధిక వయసులో ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరిన వారిలో ఒకడిగా అరుదైన ఘనత సాధించాడు. 1968 తర్వాత రొలాండ్ గారోస్‌లో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా అతడు నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే.. అత్యధిక వయసులో ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరిన వారి జాబితాలో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు జొకోవిచ్. పాంచో గోంజెల్స్ 40 ఏళ్ల వయసులో రొలాండ్ గారోస్‌లో నాకౌట్ మ్యాచ్ ఆడాడు. తద్వారా అత్యధిక వయసులో ఈ ఫీట్ నమోదు చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు. అతడి తర్వాతి స్థానాన్ని ఇప్పుడు జొకోవిచ్ దక్కించుకున్నాడు.


రికార్డుల మీద రికార్డులు..

క్వార్టర్‌ఫైనల్‌లో ప్రపంచ 3వ ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించాడు జొకోవిచ్. ఈ గెలుపుతో ఫ్రెంచ్ ఓపెన్‌లో 100 విజయాలు పూర్తి చేసుకున్నాడతను. తద్వారా రఫెల్ నాడల్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా సెర్బియా స్టార్ నిలిచాడు. అంతేగాక ఇది అతడికి 51వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ కావడం మరో విశేషం. ఈ రకంగానూ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు జొకోవిచ్. కాగా, అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సెమీస్ ఫైట్‌లో అతడు ఆరంభంలో ఇబ్బంది పడ్డాడు. మొదటి సెట్‌లో డామినేషన్ చూపించిన జ్వెరెవ్ 6-4తో సొంతం చేసుకున్నాడు. అయితే పట్టువదలని జొకోవిచ్.. అద్భుతమైన డ్రాప్ షాట్లు, సాలిడ్ డిఫెన్స్‌తో తర్వాతి రెండు సెట్లను గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ సిన్నర్ (ఇటలీ)తో తలపడనున్నాడతను.


ఇవీ చదవండి:

ఇది మనందరి బాధ్యత: రోహిత్

పోలీసులు వద్దన్నా ఆర్సీబీ వినలేదా?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:37 PM