Share News

Chinnaswamy stadium stampede: పోలీసులు వద్దన్నా ఆర్సీబీ యాజమాన్యం వినలేదా? బుధవారం సాయంత్రం అసలేం జరిగింది

ABN , Publish Date - Jun 05 , 2025 | 02:15 PM

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును పలు వివాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.

Chinnaswamy stadium stampede: పోలీసులు వద్దన్నా ఆర్సీబీ యాజమాన్యం వినలేదా? బుధవారం సాయంత్రం అసలేం జరిగింది
RCB Celebrations

ఐపీఎల్ ట్రోఫీ (IPL 2025) గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును పలు వివాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. నిజానికి విక్టరీ పరేడ్‌కు, సంబరాలకు బెంగళూరు పోలీసుల నుంచి ఆరంభంలో అనుమతి రాలేదు (chinnaswamy stadium stampede). ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పరేడ్‌కు అనుమతి రద్దైందని వార్తలు వచ్చాయి.


బుధవారం సాయంత్రం అనూహ్యంగా విక్టరీ పరేడ్‌కు, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఆ అనుమతుల వెనుక ఆర్సీబీ యాజమాన్యం మొండి పట్టుదల ఉందట. విక్టరీ సెలబ్రేషన్స్‌ను వాయిదా వేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి పోలీసులు సూచించారట. భావోద్వేగాలు చల్లబడే వరకు వేడుకలను వాయిదా వేయాలని, ఆదివారం సాయంత్రం విజయోత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారట. అయితే అప్పటివరకు ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు ఉండరని ఆర్సీబీ యాజమాన్యం తొందరపడిందట.


ఇండియా-పాక్ వివాదాల కారణంగా ఇప్పటికే ఐపీఎల్ ఆలస్యంగా ముగిసింది. ఇప్పుడు వారిని ఆదివారం వరకు ఉంచడం కష్టమని ఆర్సీబీ యాజమాన్యం భావించింది. అందుకే ప్రభుత్వ పెద్దల ద్వారా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే అందరూ ఊహించిన దాని కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా అభిమానులు వచ్చేశారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఇంతటి ఘోర విషాదం చోటు చేసుకుంది.


ఇవీ చదవండి:

మాల్యా గాలి తీసిన ఎస్‌బీఐ!

ఈ కప్పు మీదే: కోహ్లీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 02:15 PM