Share News

ఈ కప్పు మీదే: కోహ్లీ

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:06 AM

భారీ స్థాయిలో హాజరైన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను చూసి విరాట్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి కనులు చెమర్చాయి...

ఈ కప్పు మీదే: కోహ్లీ

బెంగళూరు: భారీ స్థాయిలో హాజరైన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను చూసి విరాట్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి కనులు చెమర్చాయి. దాంతో మైక్‌ అందుకొన్న వెంటనే కోహ్లీ ప్రసంగించ లేకపోయాడు. ఎట్టకేలకు తేరుకొని ‘ఇకపై మనం ఈసారి కప్పు మనదే అంటూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి కప్పు మనది కాబట్టి’ అని అన్నాడు. అంతే..అభిమానుల హోరుతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. కోహ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘అభిమానులూ..ఈ కప్పు మీది. ఎంతో అద్భుతమైన ఈ నగరానిది. ఈ 18 ఏళ్లలో మాకు మీరు అండగా నిలిచారు. ప్రపంచంలో ఎక్కడా..ఏ జట్టుకు ఇంత ఫ్యాన్‌ బేస్‌ ఉండడం నేను చూడలేదు’ అని అన్నప్పుడు అభిమానులు కేరింతలు కొట్టారు. ‘తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా తనేమిటో రుజువు చేసుకున్న పటీదార్‌కు జేజేలు పలకండి’ అని కోహ్లీ పిలుపునిచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 05:06 AM