ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tanmay Srivastava: అంపైర్‌గా వరల్డ్ కప్ హీరో.. కోహ్లీ ఫ్రెండ్ క్రేజీ రికార్డ్

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:35 PM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్రెండ్ ఇప్పుడు అంపైర్ అవతారం ఎత్తాడు. ఒకప్పుడు కింగ్‌తో కలసి ఆడినోడు ఇప్పుడు అతడి మ్యాచులకు అంపైరింగ్ చేయనున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్‌లో చాలా మంది ఆటగాళ్లతో కలసి ఆడాడు. డొమెస్టిక్ టీమ్ ఢిల్లీతో పాటు భారత జట్టు, అలాగే ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అనేక మంది ప్లేయర్లతో కలసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. అలాంటి కోహ్లీతో కలసి ఆడిన ఓ ఆటగాడు ఇప్పుడు అంపైర్ అవతారం ఎత్తాడు. అది కూడా విరాట్ ఆడబోయే ఐపీఎల్-2025లో కావడం గమనార్హం. తన దోస్తు మ్యాచ్‌కే అతడు అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. మరి.. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


ఐపీఎల్‌లోనూ ఆడాడు

కోహ్లీ ఫ్రెండ్ తన్మయ్ శ్రీవాస్తవ అంపైర్ అవతారం ఎత్తాడు. ఐపీఎల్-2025లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ఆల్రెడీ లీగ్ నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అప్పట్లో అండర్-19 ప్రపంచ కప్‌లో కోహ్లీ, జడేజాతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు తన్మయ్. ఆ తర్వాత ఐపీఎల్‌లో 2008, 2009 సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అయితే ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడని తన్మయ్.. ఐదేళ్ల కిందే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.


క్రేజీ రికార్డ్

ఐపీఎల్‌లో ఆడటమే గాక అంపైర్‌గానూ వ్యవహరించిన తొలి ప్లేయర్‌గా తన్మయ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇకపోతే, రిటైర్మెంట్ తర్వాత డొమెస్టిక్ క్రికెట్‌కు సేవలు అందించిన తన్మయ్.. కామెంటేటర్‌గానూ మారాడు. ఇప్పుడు ఐపీఎల్ నయా సీజన్ కోసం అతడ్ని అంపైర్‌గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ధారించింది. రియల్ ప్లేయర్ ఎప్పుడూ గ్రౌండ్‌ను వీడడు.. రోల్ మారింది అంతే అంటూ తన్మయ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పింది యూపీ బోర్డు. కాగా, 2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ 159 రన్స్‌కే చాప చుట్టేసింది. ఆ మ్యాచ్‌లో 46 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు తన్మయ్. ఆ ఇన్నింగ్స్ లేకపోతే మ్యాచ్ భారత్ చేజారేది.


ఇవీ చదవండి:

ఐపీఎల్ కోసం రాహుల్ త్యాగం

ఐపీఎల్ కీలక మ్యాచ్ రీషెడ్యూల్

కోహ్లీ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 12:40 PM