SRH Playoff Scenario: సన్‌రైజర్స్‌కు ఒకటే దారి.. ఇలా చేస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు..
ABN, Publish Date - Apr 18 , 2025 | 01:59 PM
IPL 2025 Playoffs: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ముంబై ఇండియన్స్ మీద ఓటమితో కొత్త కష్టాల్ని కొనితెచ్చుకుంది కమిన్స్ సేన. ఈ నేపథ్యంలో అసలు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఎస్‌ఆర్‌హెచ్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్‌పై గెలుపుతో సక్సెస్ ట్రాక్ ఎక్కేసిందని అనుకుంటే.. నిన్న వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పరాభవం పాలైంది కమిన్స్ సేన. 4 వికెట్ల తేడాతో ఓడి తాజా సీజన్‌లో 5వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే సగం మ్యాచులు ఆడేసిన నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీకి ప్లేఆఫ్స్ చాన్సులు ఉన్నాయా.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఎస్‌ఆర్‌హెచ్ ఏం చేయాలి.. అనేది ఇప్పుడు చూద్దాం..
నేరుగా ఎలిమినేటర్‌కు..
సన్‌రైజర్స్‌కు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 2 విజయాలు, 5 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది ఎస్‌ఆర్‌హెచ్. ఒకవేళ తదుపరి ఆడే మిగతా 7 మ్యాచుల్లోనూ నెగ్గితే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. దీంతో పాటు టాప్-2లోనూ నిలవొచ్చు. అదే జరిగితే ఎలిమినేటర్‌లో ఆడుతుంది కమిన్స్ సేన. ఒకవేళ మిగిలిన 7 మ్యాచుల్లో ఆరింట్లో నెగ్గితే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో గట్టి పోటీని ఇవ్వొచ్చు. బెర్త్ కన్ఫర్మేషన్ కోసం ఇతర జట్ల జయాపజయాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఎన్ని మ్యాచుల్లో నెగ్గాలంటే..
గత రెండు సీజన్లను చూసుకుంటే 16 పాయింట్లు సాధించిన జట్లు కూడా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. కాబట్టి ఇకపై ఆడాల్సిన 7 మ్యాచుల్లో ఆరింట నెగ్గినా సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్ ద్వారాలు తెరుచుకునే ఉంటాయి. 7 మ్యాచుల్లో కనీసం 5 మ్యాచుల్లో గెలిచినా కమిన్స్ సేనకు నెక్స్ట్ స్టేజ్‌కు వెళ్లే చాన్స్ ఉంటుంది. అయితే అందుకు నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపర్చుకోవాలి. ప్రస్తుతం మైనస్ 1.217తో ఉన్న రన్‌రేట్‌ను ప్లస్‌లోకి మార్చుకోవాలి. అందుకోసం భారీ విజయాలు సాధిస్తూ పోవాలి. అప్పుడు గానీ టాప్-4లో చోటు దక్కదు. మిగిలిన సగం మ్యాచుల్లో కనీసం 4 మ్యాచుల్లో నెగ్గి, నెట్ రన్‌రేట్ భారీగా మెరుగుపడినా మ్యాథమెటికల్‌గా సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉంటాయి. కానీ అందుకోసం ఇతర మ్యాచుల రిజల్ట్స్, లక్ ఫ్యాక్టర్ మీద ఆధారపడాలి. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఇకపై ప్రతి మ్యాచ్‌ను భారీ తేడాతో నెగ్గడం లేదా కనీసం గెలవడం మీద దృష్టి పెట్టాలి. ఒకవేళ ఒకట్రెండు మ్యాచుల్లో ఓడినా తక్కువ తేడాతో ఓడి నెట్ రన్‌రేట్ పడిపోకుండా చూసుకోవాలి. కాగా, కాటేరమ్మ ఆశీస్సులు బలంగా ఉంటే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం ఖాయమని నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
రాహుల్ దగ్గర కోట్ల రూపాయల కార్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2025 | 02:07 PM