Shikhar Dhawan Girlfriend: గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ధవన్.. చాహల్ కూడా..
ABN, Publish Date - May 01 , 2025 | 08:32 PM
Team India: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఎట్టకేలకు ఓపెన్ అయిపోయాడు. తన లవ్ లైఫ్ గురించి అతడు క్లారిటీ ఇచ్చాడు. తన నయా ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు.
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొత్త అమ్మాయితో అతడు డేటింగ్ చేస్తుండటమే దీనికి రీజన్. చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలు ధవన్ ఎక్కడికి వెళ్లినా.. మిస్టరీ గర్ల్ ప్రత్యక్షం అవుతుండటం డిస్కషన్స్‌కు దారితీసింది. ధవన్‌తో ఉన్న ఆ అమ్మాయి ఎవరంటూ ఫ్యాన్స్ తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఎట్టకేలకు ఈ విషయంపై ఓపెన్ అయిపోయాడు లెప్టార్మ్ బ్యాటర్. తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను అందరికీ పరిచయం చేశాడు. మరి.. ఈ సంగతేంటో ఇప్పుడో లుక్కేద్దాం..
ఒకరికొకరు..
ధవన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఇందులో అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సోఫీ షైన్ కూడా ఉంది. ఈ ఫొటోకు మై లవ్ అంటూ లవ్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టాడు ధవన్. ఇందులో ఈ జోడీ నవ్వులు చిందిస్తూ కనిపించారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో సోఫీ షైన్ క్యూట్ లుక్స్‌తో అదరగొట్టింది. ధవన్ కూడా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మొత్తానికి తన ప్రేయసిని ధవన్ పరిచయం చేయగా.. ఈ పోస్ట్‌కు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లైక్ కొట్టాడు. సోఫీ కూడా దీనికి లైక్ కొట్టింది. ఈ ఫొటో చూసిన నెటిజన్స్ వాళ్లను అభినందిస్తున్నారు. లవ్ నుంచి వీళ్లిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని.. ధవన్ లైఫ్‌లోకి సోఫీ సంతోషం తీసుకురావాలని కోరుకుంటున్నారు. వీళ్ల జంట చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ పెయిర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఇవీ చదవండి:
కోహ్లీ సీక్రెట్ రివీల్ చేసిన ధోని
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 01 , 2025 | 08:32 PM