Rohit Sharma IPL 2025: ఐపీఎల్‌లో నా టార్గెట్ అదే.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - May 01 , 2025 | 04:32 PM
Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన నయా గోల్ ఏంటో చెప్పేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తాను ఏ లక్ష్యం కోసం ఆడుతున్నాడో హిట్‌మ్యాన్ రివీల్ చేసేశాడు. అతడి టార్గెట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

రోహిత్ శర్మ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో ఒకడు. ముంబై ఇండియన్స్‌కు సారథిగా ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు హిట్‌మ్యాన్. 2013, 2015, 2017, 2019, 2020లో ఎంఐని విజేతగా నిలిపాడు. ఈ ఐదు ట్రోఫీలతో పాటు రోహిత్ ఖాతాలో మరో ఐపీఎల్ కప్పు కూడా ఉంది. 2008లో చాంపియన్‌గా నిలిచిన డెక్కన్ చార్జర్స్‌లోనూ అతడు కీలక ప్లేయరే. ఇలా ఊహకందని రీతిలో ట్రోఫీలు, వేలాది పరుగులు, లెక్కకు మించి రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా క్యాష్ రిచ్ లీగ్‌లో ఓ టార్గెట్ కోసమే తాను కంటిన్యూ అవుతున్నానని రోహిత్ అన్నాడు. మరి.. హిట్‌మ్యాన్ లక్ష్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
అదే ముఖ్యం..
ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ పరుగులు చేసేయాలనే కోరిక తనకు లేదన్నాడు రోహిత్. ముంబై ఇండియన్స్‌ను గెలిపించాలి అనే లక్ష్యం కోసమే తాను ఆడుతున్నానని తెలిపాడు. బరిలోకి దిగిన ప్రతిసారి ఎంఐకి విజయం అందించాలనేది టార్గెట్‌గా పెట్టుకుంటానని పేర్కొన్నాడు హిట్‌మ్యాన్. అందుకోసం బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఒక సీజన్‌లో 600, 700 లేదా 800 పరుగులు కొట్టినా మన జట్టు ఓడిపోయినప్పుడు ఆ రన్స్‌కు వ్యాల్యూనే లేదని స్పష్టం చేశాడు రోహిత్. అందుకే ఎంఐని చాంపియన్‌గా నిలబెట్టడం మీదే తన ఫోకస్ ఉంటుందని వ్యాఖ్యానించాడు. పరుగులు, రికార్డుల కంటే జట్టు విజయమే లక్ష్యంగా తాను ఆడతానని వివరించాడు హిట్‌మ్యాన్. కాగా, ఐపీఎల్-2025లో 9 మ్యాచుల్లో కలిపి 240 పరుగులు చేశాడతను. ఈ సీజన్ ఆరంభంలో విఫలమైన రోహిత్.. సెకండాఫ్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తుండటం విశేషం.
ఇవీ చదవండి:
ధోనీని సీఎస్‌కే ఓనర్ ఎందుకు ఆపినట్లు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి