Mumbai Indians: ముంబైకి గట్టి షాక్.. మ్యాచ్ విన్నర్ దూరం..
ABN , Publish Date - May 01 , 2025 | 01:42 PM
IPL 2025: ప్లేఆఫ్స్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. మ్యాచ్ విన్నర్ ఆ టీమ్‌కు దూరమయ్యాడు. మరి.. ఎవరా ప్లేయర్, ఎందుకు టోర్నీ నుంచి తప్పుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది ముంబై ఇండియన్స్. ఎప్పటిలాగే ఈ సీజన్‌ను కూడా ఓటములతో ఆరంభించిన హార్దిక్ సేన.. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్లు మార్చి పరుగులు తీస్తోంది. వరుస విక్టరీలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే 10 మ్యాచుల్లో 12 పాయింట్లతో పటిష్టంగా ఉన్న ఎంఐ.. 4 మ్యాచుల్లో కనీసం రెండింట్లో నెగ్గినా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. మూడింట గెలిస్తే టాప్-2లో నిలిచే అవకాశాలు ఉంటాయి. ఈ తరుణంలో ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ మ్యాచ్ విన్నర్ ముంబైకి దూరమయ్యాడు. మరి.. ఎవరా ప్లేయర్ అనేది ఇప్పుడు చూద్దాం..
సీజన్ నుంచి ఔట్..
రాజస్థాన్ రాయల్స్‌తో కీలక సమరానికి సిద్ధమవుతున్న ముంబైకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ టీమ్ స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్ గాయం కారణంగా మొత్తం టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కేరళకు చెందిన 24 ఏళ్ల పుతుర్ సీజన్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో డెబ్యూ ఇచ్చాడు. మొత్తంగా ఇప్పటివరకు 5 మ్యాచుల్లో 6 వికెట్లతో తానేంటో ప్రూవ్ చేశాడు. అయితే అతడి గాయం వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. పుతుర్ ప్లేస్‌లో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను టీమ్‌లోకి తీసుకుంది ముంబై మేనేజ్‌మెంట్. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. విఘ్నేశ్ పుతుర్ త్వరగా రికవర్ అవ్వాలని ఆకాంక్షిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టింది ఎంఐ. మరి.. విఘ్నేశ్ స్థానంలో వచ్చిన రఘు శర్మ అతడి స్థానాన్ని ఎంతవరకు భర్తీ చేస్తాడో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి