‘అజర్’ పేరును తొలగించొద్దు
ABN , Publish Date - May 01 , 2025 | 05:08 AM
టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్‌కు...

అంబుడ్స్‌మన్ ఆదేశాలపై హైకోర్టు స్టే
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్‌కు ఉన్న అజరుద్దీన్ పేరును తొలగించాలంటూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని పేర్కొంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజర్ నిబంధనలు ఉల్లంఘించి ఓ స్టాండ్‌కు తన పేరు పెట్టుకొన్నట్టు లార్డ్స్ క్రికెట్ క్లబ్.. ఎథిక్స్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. విచారించిన అంబుడ్స్‌మన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద స్టాండ్‌కు ఉన్న అజర్ పేరును తొలగించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని అజర్ హైకోర్టులో సవాల్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: చెన్నై టీమ్ మెరుగుపడాలంటే.. ధోనీ రిటైర్ కావడం మంచిది: ఆడమ్ గిల్‌క్రిస్ట్
IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి