MS Dhoni: చెన్నై టీమ్ మెరుగుపడాలంటే.. ధోనీ రిటైర్ కావడం మంచిది: ఆడమ్ గిల్‌క్రిస్ట్
ABN , Publish Date - Apr 30 , 2025 | 07:03 PM
తమిళనాడు క్రికెట్ అభిమానులందరూ ధోనీని తమవాడిగా భావిస్తారు. అందుకే వయసు అయిపోయినా, గాయం వేధిస్తున్నా ధోనీ మాత్రం ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఐదుసార్లు చెన్నైకు ధోనీ ఐపీఎల్ ట్రోఫీ అందించాడు.
ఐపీఎల్ (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే ధోనీ.. ధోనీ (MS Dhoni ) అంటే చెన్నై సూపర్ కింగ్స్. తమిళనాడు క్రికెట్ అభిమానులందరూ ధోనీని తమవాడిగా భావిస్తారు. అందుకే వయసు అయిపోయినా, గాయం వేధిస్తున్నా ధోనీ మాత్రం ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఐదుసార్లు చెన్నైకు ధోనీ ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. అయితే ఈ సీజన్‌లో మాత్రం చెన్నై టీమ్ తడబడుతోంది. స్వంత మైదానంలో కూడా గెలవలేక ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది (MS Dhoni retirment).

ఈ సీజన్‌లో చెన్నై టీమ్ పని దాదాపు అయిపోయినట్టే. ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు మూసుకుపోయినట్టే. పూర్తిగా ధోనీనే నమ్ముకుని గతేడాది జరిగిన మెగా వేలంలో మంచి ఆటగాళ్ల కోసం చెన్నై యాజమాన్యం ప్రయత్నించలేదు. దీంతో జట్టు ప్రదర్శన ఘోరంగా మారిపోయింది. చాలా మంది మాజీలు చెన్నై టీమ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) కూడా చెన్నై టీమ్ ప్రదర్శనపై స్పందించాడు. ధోనీ రిటైర్ అయితే మంచిదని సూచించాడు. వచ్చే సీజన్ నుంచి ధోనీ తప్పుకుంటే చెన్నై ప్రదర్శన మెరుగుపడుతుందని అన్నాడు.

*ఐ లవ్ ఎంఎస్ ధోనీ. అతడొక ఛాంపియన్. అతడు క్రికెట్‌లో సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఇంకేమీ లేదు. అతడు సాధించాల్సినదంతా ఇప్పటికే సాధించేశాడు. నా అభిప్రాయం ప్రకారం వచ్చే సీజన్ అతడు ఆడాల్సిన అవసరం లేదు. చెన్నై టీమ్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడు రిటైర్మెంట్ ప్రకటించాలి. అయితే ఏం చేయాలనేది మాత్రం అతని ఇష్టమే. ధోనీకి అంతా తెలుసు *అంటూ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..