హెచ్‌సీఏకు ఊరట
ABN , Publish Date - May 01 , 2025 | 05:10 AM
హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైకోర్టులో ఊరట లభించింది. రోజువారీ ఖర్చులు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు తప్ప ఆర్థికపరమైన...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైకోర్టులో ఊరట లభించింది. రోజువారీ ఖర్చులు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు తప్ప ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న పరిపాలన, విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోరాదని హెచ్‌సీఏకు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ బుధవారం స్టే విధించింది. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని.. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పేర్కొంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఏకసభ్య ఽధర్మాసనం ఈనెల 21న విచారణ చేపట్టి.. హెచ్‌సీఏ ఆర్థిక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి