ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: బుడతడి ప్రశ్నకు రోహిత్ అదిరిపోయే ఆన్సర్.. ఇది ఊహించలేదు!

ABN, Publish Date - Jun 01 , 2025 | 08:56 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసేందుకు ఆపసోపాలు పడుతుంటారు బౌలర్లు. క్రీజులో గానీ సెటిల్ అయితే తమకు బడితపూజ చేస్తాడని భయపడుతుంటారు.

Rohit Sharma

టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరు చెబితేనే బౌలర్లు వణుకుతారు. ఎక్కడ తమ మీదకు దూకుతాడోనని.. బ్యాట్‌తో తాండవం చేస్తాడేమోనని భయపడతారు. సాధారణంగా తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సులు బాదుతుంటాడు హిట్‌మ్యాన్. అలాంటిది క్రీజులో గానీ కుదురుకున్నాడా విశ్వరూపం చూపిస్తాడు. అందుకే అతడ్ని ఎంత త్వరగా ఔట్ చేద్దామా అని వ్యూహాలు పన్నుతుంటారు. చూస్తుండగానే మ్యాచ్‌ను చేతుల్లో నుంచి లాక్కెళ్లిపోతాడు కాబట్టి అతడిపై అన్ని రకాలు అస్త్రాలు ప్రయోగిస్తారు. రోహిత్ బలహీనతల మీద దాడులు చేస్తారు. కానీ ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ.. బలహీనతలను బలంగా మార్చుకుంటూ ఈ స్థాయికి ఎదిగాడు హిట్‌మ్యాన్. అలాంటోడు తొలిసారి తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టాడు. ఇంతకీ అతడేం చెప్పాడంటే..


అదే బలహీనత..

గ్రౌండ్ లోపల, బయట ఎంతో సరదాగా ఉండే రోహిత్.. సహచర ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు, అభిమానులతో ఈజీగా కలసిపోతాడు. బయట ఫ్యాన్స్ కలిస్తే వారితో సరదాగా మాట్లాడుతుంటాడు, సెల్ఫీలు ఇస్తుంటాడు. అప్పుడప్పుడు జోక్స్ వేస్తూ అభిమానుల్ని నవ్విస్తుంటాడు. అలాంటి రోహిత్ తాజాగా ఓ బుడతడు అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హిట్‌మ్యాన్.. ఫ్రాంచైజీ తరఫున ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో ఫ్యాన్స్ నేరుగా రోహిత్‌తో మాట్లాడారు. రోహిత్ భయ్యా.. నీ బ్యాటింగ్‌లో బలహీనత ఏంటి.. కొంచెం చెప్పవా.. అంటూ ఓ బుడ్డోడు ధైర్యం చేసి ఓ ప్రశ్న అడిగాడు. దీనికి హిట్‌మ్యాన్ తనదైన రీతిలో ఆన్సర్ ఇచ్చాడు. నన్ను ఔట్ చేయడమా.. అది కుదిరే పని కాదంటూ సమాధానం ఇచ్చాడు రోహిత్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. హిట్‌మ్యాన్‌ను ఔట్ చేయడం అంటే మాటలా అని కామెంట్స్ చేస్తున్నారు. తనకే వీక్‌నెస్‌లూ లేవని అతడు బయటపెట్టాడని.. బుడ్డోడి ప్రశ్నకు సింపుల్‌గా, తెలివిగా ఆన్సర్ ఇచ్చాడని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

రింకూ సింగ్‌కు పెళ్లి ఫిక్స్..

స్పిన్ మాంత్రికుడు వస్తున్నాడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 09:01 PM