Share News

Rinku Singh Marriage: రింకూ సింగ్‌కు పెళ్లి ఫిక్స్.. కేకేఆర్ క్రికెటర్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరో తెలుసా?

ABN , Publish Date - Jun 01 , 2025 | 07:28 PM

టీమిండియా యంగ్ క్రికెటర్, కోల్‌‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఓ రాజకీయవేత్తను పెళ్లాడబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు.

Rinku Singh Marriage: రింకూ సింగ్‌కు పెళ్లి ఫిక్స్.. కేకేఆర్ క్రికెటర్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరో తెలుసా?
Rinku Singh ready to marry To Politician Priya Saroj

టీమిండియా యంగ్ క్రికెటర్, కోల్‌‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ (Rinku Singh) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఓ రాజకీయవేత్తను పెళ్లాడబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ (Priya Saroj)ను వివాహం చేసుకోబోతున్నాడు. 25 సంవత్సరాల ప్రియా సరోజ్ అతి పిన్న వయస్కురాలైన ఎంపీ. ఆమె వయసు 25 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్‌ నుంచి ప్రియా సరోజ్ గెలుపొందారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బి కూడా పూర్తి చేసింది.


ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ కూడా యూపీలో ప్రముఖ రాజకీయవేత్త. ఆయన సమాజ్‌వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. తుఫానీ సరోజ్ తన కూతురి వివాహం గురించి తాజాగా మాట్లాడారు. రింకూ సింగ్ తండ్రితో ప్రియ వివాహం గురించి మాట్లాడినట్టు తుఫానీ ధ్రువీకరించారు. కాగా, జూన్ 8న లఖ్‌నవూలోని సెవెన్ స్టార్ హోటల్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగబోతోంది. అలాగే వారణాసిలోని తాజ్ హోటల్‌లో వివాహం జరగబోతోందని సమాచారం. నవంబర్‌ 18వ తేదీన వీరి వివాహం జరగబోతోంది.


లఖ్‌నవూలో జరిగే నిశ్చితార్థ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనబోతున్నారు. అయితే నవంబర్‌లో జరిగే వివాహానికి రాజకీయ నాయకులు, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని తెలుస్తోంది. నిజానికి వీరి వివాహానికి సంబంధించిన వార్తలు ఈ ఏడాది జనవరిలోనే వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో ప్రియ తండ్రి ఖండించారు.


ఇవి కూడా చదవండి..

IPL 2025 MI vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే


IPL 2025 MI vs PBKS: ఫైనల్‌కు దారేది.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2025 | 07:43 PM