IPL 2025 MI vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - Jun 01 , 2025 | 07:02 PM
ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతోంది.
ఐపీఎల్‌లో (IPL 2025) మరో అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఫైనల్ బెర్త్ కోసం రెండు బలమైన జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతోంది (MI vs PBKS).
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దారుణ పరాజయం పాలైంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ముంబైతో ఈ రోజు జరగబోయే క్వాలిఫియర్-2లో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్‌లో తలపడుతుంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్, దీపక్ ఛాహర్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్, అశ్వనీ కుమార్
పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, కైలీ జేమీసన్, ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
ఇవీ చదవండి:
స్పిన్ మాంత్రికుడు వస్తున్నాడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి