ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RCB As Most Valuable Team: సీఎస్‌కేను దాటేసిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ తెలిస్తే ఫ్యూజులు ఔట్!

ABN, Publish Date - Jul 08 , 2025 | 01:56 PM

ఆర్సీబీ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్-2025 టైటిల్‌ను గెలుచుకున్న కోహ్లీ టీమ్.. ఇప్పుడు సీఎస్‌కేను దాటేసి మరో రేర్ ఫీట్ నమోదు చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

RCB Brand Value

ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఎట్టకేలకు సొంతం చేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఐపీఎల్-2025 సీజన్‌లో విజేతగా నిలిచి తమ చిరకాల కోరికను నిజం చేసుకుంది. ఫైనల్ ఫైట్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఇలా చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌గా రికార్డు సృష్టించింది బెంగళూరు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను కోహ్లీ టీమ్ అధిగమించింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

ఊహించని రీతిలో..

ఐపీఎల్‌లో మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌గా ఆర్సీబీ (269 మిలియన్లు) నిలిచింది. ఆ జట్టు విలువ రూ.2,256 కోట్లకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ 18.5 శాతం పెరగడం విశేషం. అత్యధిక విలువ కలిగిన జట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్ (242 మిలియన్లు). గత సంవత్సరంతో పోలిస్తే ఈ జట్టు విలువ 18.6 శాతం పెరిగింది. ఇంతకుముందు వరకు టాప్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (235 మిలియన్లు) మూడో స్థానానికి పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఆ జట్టు బ్రాండ్ వాల్యూ కేవలం 1.7 శాతం మాత్రమే పెరిగింది.

పంజాబ్ అదరహో..

బ్రాండ్ వాల్యూ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (227 మిలియన్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (154 మిలియన్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (152 మిలియన్లు), రాజస్థాన్ రాయల్స్ (146 మిలియన్లు), గుజరాత్ టైటాన్స్ (142 మిలియన్లు), పంజాబ్ కింగ్స్ (141 మిలియన్లు), లక్నో సూపర్ జెయింట్స్ (122 మిలియన్లు) నిలిచాయి. పంజాబ్ జట్టు అందరి కంటే ఎక్కువగా తమ బ్రాండ్ వాల్యూను పెంచుకుంది. గతేడాదితో పోలిస్తే ఆ టీమ్ విలువ ఈసారి 39.6 శాతం పెరగడం విశేషం. ఇక, ఐపీఎల్ టోర్నీ బ్రాండ్ వాల్యూ 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.32,721 కోట్లు)కు చేరుకుంది.

ఇవీ చదవండి:

నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ

అందుకే 400 వద్దనుకున్నా..

రాక్షసుడ్ని దింపుతున్నారు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 02:04 PM