ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RCB IPL 2025: స్టార్ బ్యాటర్ దూరం.. ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్

ABN, Publish Date - May 08 , 2025 | 09:06 AM

Indian Premier League: ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్న ఆ ఆటగాడు లేకపోవడం బెంగళూరుకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.

RCB

ఐపీఎల్-2025లో అదరగొడుతోంది ఆర్సీబీ. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బెంగళూరు.. వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరువైంది. ఆడిన 11 మ్యాచుల్లో 16 పాయింట్లతో ఆ టీమ్ సాలిడ్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్స్‌లో గెలిచి తొలి కప్పు కలను నెరవేర్చుకోవాలని ఆర్సీబీ తహతహలాడుతోంది. అయితే ఆ టీమ్‌కు వరుస షాకులు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా ఇంజ్యురీతో కీలక మ్యాచులకు దూరమవుతున్నారు. ఈ తరుణంలో బెంగళూరుకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


పడిక్కల్ పాయె.. మయాంక్ వచ్చె..

ఆర్సీబీ స్టార్ లెఫ్టాండర్ దేవ్‌దత్ పడిక్కల్ ఐపీఎల్-2025 నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి అతడు తప్పుకున్నాడు. దీంతో పడిక్కల్ స్థానంలో సీనియర్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను రీప్లేస్ చేసింది బెంగళూరు. మయాంక్ తమ ఫ్రాంచైజీకి సైన్ చేశాడని ఆర్సీబీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కాగా, ఈ సీజన్‌లో నంబర్ 3లో బ్యాటింగ్‌ చేసిన పడిక్కల్.. 10 మ్యాచుల్లో కలిపి 247 పరుగులు చేశాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలసి భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తూ ఆర్సీబీ బిగ్ స్కోర్స్ సెట్ చేయడంతో పాటు చేజ్ చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు. అలాంటోడు ప్లేఆఫ్స్‌కు ముందు దూరమవడం బిగ్ షాకే. అయితే మయాంక్ రూపంలో మరో క్వాలిటీ, ఎక్స్‌పీరియెన్స్‌డ్ బ్యాటర్ దొరకడం మంచి విషయమనే చెప్పాలి. గ్రూప్ స్టేజ్‌లో ఇంకో 3 మ్యాచులే ఉన్నందున మయాంక్‌ అగర్వాల్‌కు ఎంతమేరకు చాన్సులు ఇస్తారు.. ప్లేఆఫ్స్ లాంటి బిగ్ మ్యాచెస్‌లో బరిలోకి దింపుతారా.. లేదా.. అనేది చూడాలి.


ఇవీ చదవండి:

రోహిత్‌కు దక్కే పెన్షన్ ఎంతంటే..

ఈడెన్‌కు బాంబు బెదిరింపు

టెస్టులిక చాలని

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 08 , 2025 | 09:13 AM