Rohit Sharma Pension: రోహిత్‌కు బీసీసీఐ నుంచి దక్కే పెన్షన్ ఎంతంటే..
ABN , Publish Date - May 08 , 2025 | 08:10 AM
BCCI: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఇకపై లాంగ్ ఫార్మాట్‌కు దూరంగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అతడికి దక్కే పెన్షన్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..

ధనాధన్ హిట్టింగ్‌తో టెస్టులను కూడా టీ20ల మాదిరిగా ఆడే భారత కెప్టెన్ రోహిత్ శర్మ లాంగ్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. టెస్టులకు వీడ్కోలు పలికినా వన్డేల్లో మాత్రం కంటిన్యూ అవుతానని స్పష్టం చేశాడు హిట్‌మ్యాన్. దీంతో టీమిండియాకు టెస్టుల్లో అతడు అందించిన సేవలు, బ్యూటిఫుల్ నాక్స్‌ను అంతా గుర్తుచేసుకుంటున్నారు. రోహిత్ పవర్ హిట్టింగ్‌ను తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు. ఇదే తరుణంలో హిట్‌మ్యాన్‌కు దక్కే పెన్షన్ ఎంతనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
బిగ్ అమౌంటే..
సుదీర్ఘ కెరీర్‌లో 67 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు రోహిత్. దీంతో భారత క్రికెట్ బోర్డు అందించే పెన్షన్‌కు అతడు అర్హత సాధించాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాళ్లకు నెలకు రూ.70 వేల పెన్షన్ ఇస్తారు. కాబట్టి హిట్‌మ్యాన్ కూడా ఇంతే మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందుకోవచ్చు. అయితే రిటైర్మెంట్ ఇచ్చేశాడు కాబట్టి వెంటనే అతడికి పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పేసినా.. ఇంకా వన్డేల్లో అతడు కంటిన్యూ అవుతున్నాడు.
నో పెన్షన్
వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటే తప్ప రోహిత్‌కు పెన్షన్ అందే చాన్స్ లేదు. 50 ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాక బీసీసీఐ రూల్స్‌ను బట్టి ఒక్కో ఫార్మాట్‌కు అతడు ప్రాతినిధ్యం వహించిన మ్యాచుల సంఖ్యను బట్టి నెలవారీ పెన్షన్ అందిస్తారు. అప్పటివరకు రోహిత్‌కు పెన్షన్ దక్కే చాన్స్ లేదు. పెన్షన్ కోసం ఫుల్ రిటైర్మెంట్ వరకు ఆగాల్సిందే. కాగా, టెస్ట్ రిటైర్మెంట్‌తో రోహిత్ ఆదాయం భారీగా తగ్గనుంది. బీసీసీఐ నుంచి అతడికి అందే మొత్తంలో చాలా అమౌంట్ కట్ అవ్వనుంది. ప్రస్తుతం ఏ ప్లస్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ అయిన హిట్‌మ్యాన్.. ఏ లేదా బీ కేటగిరీకి పడిపోయే చాన్స్ ఉందని సమాచారం. అదే జరిగితే ఇప్పుడు బోర్డు నుంచి రూ.7 కోట్ల పారితోషికం అందుకుంటున్న రోహిత్.. ఏ కేటగిరీకి వస్తే రూ.5 కోట్లకు పడిపోతాడు. అదే బీ కేటగిరీకి షిఫ్ట్ అయితే రూ.3 కోట్లు మాత్రమే అందుకుంటాడు.
ఇవీ చదవండి:
ఈడెన్ మ్యాచ్‌కు బాంబు బెదిరింపు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి