Share News

ఫైనల్లో భారత్‌

ABN , Publish Date - May 08 , 2025 | 04:56 AM

జెమీమా రోడ్రిగ్స్‌ (123) సెంచరీతోపాటు దీప్తి శర్మ (93, 2/57) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మహిళల ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 23 పరుగుల తేడాతో...

ఫైనల్లో భారత్‌

  • అదరగొట్టిన జెమీమా, దీప్తి

  • దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం

కొలంబో: జెమీమా రోడ్రిగ్స్‌ (123) సెంచరీతోపాటు దీప్తి శర్మ (93, 2/57) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మహిళల ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 23 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. దీంతో ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో శ్రీలంకతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుండగా.. వరుసగా మూడో ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుటైంది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (51) హాఫ్‌ సెంచరీ చేయగా, హర్మన్‌ప్రీత్‌ (28) ఫర్వాలేదనిపించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 314/7 స్కోరు మాత్రమే చేసింది. అమన్‌జోత్‌ 3 వికెట్లు తీసింది. అనెరి డ్రెక్‌సెన్‌ (81), కెప్టెన్‌ చోల్‌ ట్రయాన్‌ (61) పోరాటాలు వృథా అయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 04:56 AM