ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌తో వివాదం.. ఏంటి భయ్యా ఇలా చేశావ్!

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:10 PM

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దురుసు ప్రవర్తన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టీఎన్‌పీఎల్‌లో అంపైర్లతో అతడు వ్యవహరించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

Ravichandran Ashwin

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌-2025లో దురుసు ప్రవర్తనతో విమర్శల బారిన పడ్డాడీ స్పిన్నర్. దిండిగల్ డ్రాగన్స్-తిరుప్పూర్ తమిళయన్స్‌ మధ్య మ్యాచ్‌లో అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బౌలర్ సాయి కిషోర్ అప్పీల్ చేయడంతో లేడీ అంపైర్ వెంకటేశన్ కృతిక వెంటనే అతడ్ని ఔట్‌గా ప్రకటించింది. అయితే తాను నాటౌట్ అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు అశ్విన్. అంపైర్ నిర్ణయం మార్చుకోకపోవడంతో అశ్విన్ సీరియస్ అయ్యాడు. సహనం కోల్పోయిన మాజీ ఆల్‌రౌండర్ పెవిలియన్‌కు వెళ్తూ బ్యాటును బలంగా తన ప్యాడ్లపై కొట్టుకున్నాడు. బౌండరీ లైన్ వద్దకు రాగానే తన గ్లౌవ్స్‌ను తీసి గ్యాలరీలోకి విసిరేశాడు. దీంతో జీతం కట్ చేసి అతడికి బిగ్ షాక్ ఇచ్చారు లీగ్ నిర్వాహకులు.

జీతం కట్..

అశ్విన్ మ్యాచ్ ఫీజులో నుంచి 30 శాతం మొత్తాన్ని కట్ చేసేశాడు మ్యాచ్ రిఫరీ అర్జున్ కృపాల్ సింగ్. అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, దురుసుగా ప్రవర్తించడంతో పాటు పరికరాలను దుర్వినియోగం చేశారనే అభియోగాల కింద అతడికి జరిమానా విధించాడు మ్యాచ్ రిఫరీ. అశ్విన్ తన తప్పును ఒప్పుకున్నాడని తమిళనాడు ప్రీమియర్ లీగ్ అధికారులు తెలిపారు. కాగా, తిరుప్పూర్‌తో మ్యాచ్‌లో 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు అశ్విన్. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో అతడి జట్టు ఓటమిపాలైంది. అశ్విన్ ఔట్ అయిన బంతి లెగ్ స్టంప్ ఆవల పిచ్ అయినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అయినా అంపైర్ ఔట్ ఇవ్వడం, అప్పటికే డీఆర్ఎస్‌లు పూర్తవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు అశ్విన్.

ఇవీ చదవండి:

29 ఏళ్లకే రిటైర్‌మెంట్

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ లో ధోనీ

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 12:19 PM