Priyank Panchal: 9 వేల రన్స్.. రోహిత్ రేంజ్‌లో ఉండాల్సినోడు.. చివరకు ఇలా చేశాడేంటి!
ABN, Publish Date - May 26 , 2025 | 08:06 PM
దేశవాళీ క్రికెట్‌లో వేలాది పరుగులు, సెంచరీల మీద సెంచరీలు చేసిన తోపు బ్యాటర్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ రేంజ్‌లో ఉండాల్సినోడు అనూహ్యంగా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
దేశవాళీ క్రికెట్‌లో వరుస సెంచరీలు కొడితే సెలెక్టర్లు ఇంప్రెస్ అయిపోతారు. నిలకడగా పరుగులు చేస్తే వాళ్లను భారత జట్టులోకి తీసుకుంటారు. కానీ కొందరు ప్లేయర్లు బ్యాడ్ లక్ వల్ల ఎప్పటికీ టీమిండియాకు ఆడలేరు. అలాంటి ఆటగాళ్లలో ప్రియాంక్ పాంచల్ ఒకడు. 35 ఏళ్ల ఈ రైటాండ్ బ్యాటర్.. డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. దాదాపు 9 వేల పరుగులు బాదాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. ఏళ్ల పాటు దేశవాళీల్లో నిలకడగా పరుగులు చేస్తూ వచ్చాడు. అయినా భారత సీనియర్ జట్టు తరఫున కనీసం డెబ్యూ చేసే చాన్స్ కూడా రాలేదు. దీంతో ఈ గుజరాత్ బ్యాటర్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ రేంజ్‌లో ఉండాల్సినోడు దేశవాళీ క్రికెటర్‌గా కెరీర్ ముగించాడు. ఇతడి గురించి మరింతగా తెలుసుకుందాం..
రికార్డులు ఘనం!
గుజరాత్-సౌరాష్ట్ర మధ్య 2008, నవంబర్‌లో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ఆరంభించాడు ప్రియాంక్ పాంచల్. అదే ఏడాది లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఈ సంవత్సరం ఫ్రిబవరి వరకు లిస్ట్-ఏలో ఆడుతూ వచ్చాడు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 8856 పరుగులు చేశాడు ప్రియాంక్. 45.18 సగటుతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్.. 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు బాదాడు. లిస్ట్-ఏలో 97 మ్యాచుల్లో 3672 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్ పరంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సమకాలీనుడు అయిన ప్రియాంక్ పాంచల్ గానీ టీమిండియాకు ఆడి ఉంటే టెస్టుల్లో తోపు బ్యాటర్‌గా పేరు తెచ్చుకునే అవకాశాలు ఉండేవి. కానీ అతడికి కనీసం డెబ్యూ చాన్స్ కూడా రాలేదు. వయసు కూడా మీద పడటంతో రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఇవీ చదవండి:
ఫైనల్ కాని ఫైనల్.. అస్సలు మిస్ అవ్వొద్దు!
బోటు బోల్తా.. సముద్రంలో దాదా ఫ్యామిలీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 08:20 PM