ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Suyash Sharma: సుయాష్ స్టన్నింగ్ డెలివరీ.. గూగ్లీ దెబ్బకు గుడ్లు తేలేశాడు!

ABN, Publish Date - May 29 , 2025 | 09:01 PM

పంజాబ్ కింగ్స్ బ్యాటర్లతో ఓ ఆటాడుకుంటున్నారు ఆర్సీబీ బౌలర్లు. ఓ రేంజ్‌లో డామినేషన్ కొనసాగిస్తోంది బెంగళూరు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆతిథ్య జట్టును వణికిస్తోంది.

Suyash Sharma

క్వాలిఫయర్-2 మ్యాచ్.. అదీ పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య అంటే బోలెడు అంచనాలు ఉంటాయి. నువ్వానేనా అంటూ ఆఖరు వరకు ఉత్కంఠగా సాగుతుందని అనుకుంటాం. కానీ ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ దీనికి రివర్స్‌లో జరుగుతోంది. అయ్యర్ సేనకు చెమటలు పట్టిస్తున్నారు బెంగళూరు బౌలర్లు. నిప్పులు చెరిగే బంతులతో ఆతిథ్య జట్టు బ్యాటర్లతో ఆటాడుకుంటున్నారు. తొలి ఓవర్ నుంచే కోహ్లీ టీమ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వికెట్ల మీద వికెట్లు తీస్తూ అసలు పోటీనే లేకుండా చేస్తోంది. బెంగళూరు బౌలర్ల ధాటికి 78 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది పంజాబ్. అయితే ఇన్ని వికెట్లలో సుయాష్ శర్మ చేసిన ఓ డిస్మిసల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.


స్టంప్స్ చెల్లాచెదురు..

లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే 2.4 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఊపు మీదున్నాడీ ఆర్సీబీ స్టార్. అతడు తీసిన వికెట్లలో శశాంక్ సింగ్‌‌ను ఔట్ చేసిన విధానం మాత్రం హైలైట్ అనే చెప్పాలి. 50 పరుగులకు 5 వికెట్లు పడిపోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన శశాంక్ 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతుండటం, మరోవైపు పరుగులు రాకపోవడంతో అతడు హిట్టింగ్‌కు దిగాలని భావించాడు. పేసర్లు జోష్‌లో ఉండటంతో స్పిన్నర్లను అటాక్ చేయాలని అనుకున్నాడు. ఈ తరుణంలో బౌలింగ్‌కు దిగాడు సుయాష్. అతడి బౌలింగ్‌లో గూగ్లీని హిట్ చేయబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు శశాంక్. పిచ్ మీద పడిన బంతి ఒక్కసారిగా లోపలకు టర్న్ అయి రావడంతో లైన్ మిస్ అయ్యాడు శశాంక్. అతడి బ్యాట్‌ను ఛేదించుకొని వెళ్లిన బంతి స్టంప్స్‌ను చెల్లాచెదురు చేసింది.


ఇవీ చదవండి:

రాసిపెట్టుకోండి.. కప్పు ఆర్సీబీదే..

పొల్లుపొల్లు కొట్టుకున్న క్రికెటర్లు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 09:01 PM