MI vs SRH IPL 2025: ముంబైతో సన్‌రైజర్స్ ఫైట్.. టార్గెట్ 300.. అస్సలు వదలొద్దు
ABN, Publish Date - Apr 17 , 2025 | 05:30 PM
Today IPL Match: ఆరెంజ్ ఆర్మీ మరో టగ్ ఆఫ్ వార్‌కు సిద్ధమవుతోంది. ముంబై ఇండియన్స్‌తో వాళ్ల హోమ్ గ్రౌండ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది సన్‌రైజర్స్. ఈ నేపథ్యంలో జట్టు అసలు టార్గెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అసలు సిసలు పోరుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్‌లో మోస్ట్ డేంజరస్ టీమ్స్‌లో ఒకటైన ముంబై ఇండియన్స్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది కమిన్స్ సేన. ఈ రెండు టీమ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో పైకి ఎగబాకాలంటే ఎస్‌ఆర్‌హెచ్‌కు విజయం తప్పనిసరి. అటు ముంబై కూడా నెగ్గి పాయింట్స్ టేబుల్‌లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. అయితే రెండు జట్లకు వాళ్ల గోల్స్ వాళ్లకు ఉన్నాయి. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కు కూడా స్పెషల్ గోల్ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
మాట నిలబెట్టుకోవాలె
క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఓ మాట ఇచ్చాడు. ఈసారి 300 కొట్టి చూపిస్తామని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు. అందుకు తగ్గట్లే ఫస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఆ జట్టు బ్యాటింగ్ యూనిట్ ఆ రేంజ్‌లో రాణించలేదు. దీంతో వరుసగా 4 మ్యాచుల్లో ఓటమిపాలైంది ఆరెంజ్ ఆర్మీ. ఎట్టకేలకు కోలుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. లాస్ట్ మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 247 రన్స్ బాదేసింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో గెలుపే కాదు.. మిషన్ 300ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పేరు చెబితే భయపడాలె
గత సీజన్‌లో రెచ్చిపోయి ఆడిన సన్‌రైజర్స్.. ఫైనల్స్ వరకు దూసుకెళ్లినా రన్నరప్‌గా నిలిచింది. అయితే ఆ సీజన్‌లో కమిన్స్ సేన ఆటతీరు చూసి 300 బాదేస్తుందని అంతా భావించారు. కానీ వర్కౌట్ కాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కూడా అది పాజిబుల్ కాలేదు. దీంతో ముంబైతో మ్యాచ్‌లోనైనా టార్గెట్ 300ను సన్‌రైజర్స్ రీచ్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాంఖడేలో పరుగుల తుఫాన్ సృష్టించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మ్యాచ్ గెలవడంతో పాటు 300 పరుగుల డ్రీమ్‌ను నెరవేర్చాలని.. కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాలని అంటున్నారు. కాటేరమ్మ కొడుకుల పేరు వింటేనే అందరూ భయపడేలా చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్.
ఇవీ చదవండి:
నాయర్.. దిలీప్‌కు ఊహించని షాక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 17 , 2025 | 05:35 PM