Share News

MI vs SRH Prediction: ఎంఐ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్.. లెక్క సరిచేయాల్సిందే

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:44 PM

IPL 2025: క్యాష్ రిచ్ లీగ్‌లో మరో బిగ్ ఫైట్‌కు టైమ్ దగ్గర పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ భీకర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

MI vs SRH Prediction: ఎంఐ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్.. లెక్క సరిచేయాల్సిందే
MI vs SRH Prediction

ఐపీఎల్-2025లో మరో మెగా ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. రెండు బడా జట్ల మధ్య ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. గెలుపు జోష్‌లో ఉన్న ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి తాడోపేడో తేల్చుకోనున్నాయి. నెగ్గితే పాయింట్స్ టేబుల్‌లో బిగ్ జంప్ చేసే చాన్స్ ఉండటంతో రెండు టీమ్స్‌ ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి.. కమిన్స్ సేన జోరును ఎంఐ తట్టుకుంటుందా.. ముంబై ఆల్‌రౌండ్ బలాన్ని తట్టుకొని ఎస్‌ఆర్‌హెచ్ లెక్క సరిచేస్తుందా.. అనేది ఇప్పుడు చూద్దాం..


బలాలు

ముంబై: ఈ సీజన్‌లో హార్దిక్ సేన పడుతూ లేస్తూ పోతోంది. ఒక మ్యాచ్‌లో గెలుపు, మరో మ్యాచ్‌లో ఓటమి అనేలా ఉంది పరిస్థితి. ఈ టీమ్‌కు ప్రధాన బలం బ్యాటింగే. రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్.. ఇలా బ్యాటింగ్ యూనిట్ సమష్టిగా రాణిస్తోంది. బౌలింగ్‌లో కర్ణ్ శర్మ, శాంట్నర్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం.

హైదరాబాద్: ఈ టీమ్‌కు బ్యాటింగే మెయిన్ స్ట్రెంగ్త్. అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్‌లో 141 పరుగుల అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్, క్లాసెన్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ అద్భుతంగా రాణిస్తున్నారు.


బలహీనతలు

ముంబై: సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫెయిల్యూర్ జట్టుకు బిగ్ మైనస్‌గా మారింది. అతడు క్విక్‌గా 30 నుంచి 40 పరుగులు చేసినా చాలు అని జట్టు మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. ఆఖర్లో విల్ జాక్స్ కూడా బ్యాట్ ఝళిపించడం అవసరం. బౌలింగ్‌లో ప్రధాన పేసర్ బుమ్రా వికెట్లు తీయలేకపోవడం ముంబైకి హెడెక్‌గా మారింది.

హైదరాబాద్: హిట్టింగ్ ఫార్ములాతో ముందుకెళ్లే సన్‌రైజర్స్‌ ఆరంభంలో వికెట్లు పడిపోతే కష్టాలు తప్పవు. ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేయడం కంటే కూడా అగ్రెసివ్‌గా ఆడాలనే అప్రోచ్ టీమ్‌కు ప్రతికూలంగా మారింది. కాబట్టి ప్లాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాటింగ్‌లో క్లాసెన్ నుంచి భారీ నాక్ బాకీ ఉంది. బౌలింగ్‌లో షమి దారుణంగా ఫెయిల్ అవడం, కెప్టెన్ కమిన్స్ కూడా భారీగా రన్స్ లీక్ చేయడం టీమ్‌కు బిగ్ మైనస్.


హెడ్ టు హెడ్

ఇరు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 10 మ్యాచుల్లో ఎస్‌ఆర్‌హెచ్.. 13 మ్యాచుల్లో ముంబై విజయఢంకా మోగించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

పేపర్ మీద రెండు జట్లు బలంగా ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ పవర్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ఆ టీమ్‌లో అంతా హిట్టింగ్ రాక్షసులే. అయితే బౌలింగ్-బ్యాటింగ్ బెటర్ బ్యాలెన్స్‌తో ఉండటం, టీమ్ కరెంట్ ఫామ్, హోం కండీషన్స్‌లో ఆడుతుండటం, హెడ్ టు హెడ్ రికార్డులు కూడా కలసిరావడం.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇవాళ్టి మ్యాచ్‌లో ముంబై గెలవడం ఖాయం.

Updated Date - Apr 17 , 2025 | 04:50 PM