Kohli-Rohit: కోహ్లీ-రోహిత్‌కు సూపర్ న్యూస్.. బీసీసీఐని మెచ్చుకోవాల్సిందే..
ABN, Publish Date - May 14 , 2025 | 03:33 PM
BCCI: టెస్టుల నుంచి తప్పుకున్నారు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్ టూర్‌కు ముందు వీళ్లు తీసుకున్న అనూహ్య నిర్ణయంపై అభిమానులు షాక్ అవుతున్నారు. వీళ్లు లేని జట్టును ఊహించలేమని అంటున్నారు.
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ.. వీళ్లు లేని టీమిండియాను ఊహించలేం. ఇకపై టెస్టుల్లో ఈ సీనియర్లు ఆడరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు స్టార్లు.. భారత బ్యాటింగ్‌కు మూలస్తంభంగా ఉంటూ వచ్చారు. సొంతగడ్డతో పాటు ఓవర్సీస్ సిరీస్‌ల్లోనూ భారత్ హవా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి దిగ్గజాలు హఠాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అంతా వాళ్ల కెరీర్, సాధించిన ఘనతల్ని నెమరు వేసుకుంటున్నారు. అదే సమయంలో పెన్షన్, ఆదాయం లాంటి ఇతర అంశాలనూ చర్చించుకుంటున్నారు. ఇద్దరి కాంట్రాక్ట్‌ల విషయంలో సంచలన నిర్ణయం తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం అన్నారంటే..
నో చేంజ్
టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ-రోహిత్.. ఇప్పటికే టీ20ల నుంచి తప్పుకున్నారు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు. దీంతో వీళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న విరాట్-రోహిత్ ఏ కేటగిరీకి పడిపోయే చాన్స్ ఉందని.. దీని వల్ల బోర్డు నుంచి వాళ్లు అందుకునే పారితోషికం రూ.7 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పడిపోతుందని రూమర్స్ వినిపించాయి. ఈ సమయంలో బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా దీనిపై స్పష్టత ఇచ్చారు. కోహ్లీ-రోహిత్ ఏ ప్లస్ గ్రేడ్‌తోనే కొనసాగుతారని.. ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదన్నారు. భారత క్రికెట్‌లో వాళ్లు కీలక భాగమని, గ్రేడ్ ఏ ప్లస్‌లో ఉండేవారికి అందే అన్ని సౌకర్యాలు ఈ దిగ్గజాలకు ఇస్తామన్నారు. దీంతో ఈ టీమిండియా స్టార్ల కాంట్రాక్ట్‌లపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పడినట్లయింది.
ఇవీ చదవండి:
కోహ్లీ రిటైర్‌మెంట్.. అనుష్క ఎమోషనల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 14 , 2025 | 03:42 PM