ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jasprit Bumrah: ఒక్క ఓవర్ వేసినా ఖేల్‌ఖతం.. ఇంత రిస్క్ అవసరమా?

ABN, Publish Date - Jun 11 , 2025 | 03:43 PM

భారత జట్టు బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాలని కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ భావిస్తున్నారు.

Jasprit Bumrah

ఐదు టెస్టుల కోసం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ఆటగాళ్లు జోరుగా సాధన చేస్తున్నారు. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ డ్రిల్స్‌లో హుషారుగా పాల్గొంటున్నారు ప్లేయర్లు. దీంతో పాటు ఫుట్‌బాల్ లాంటి ఇతర ఆటలు కూడా ఆడుతూ ఫిట్‌నెస్‌ను మరింత పెంచుకుంటున్నారు టీమిండియా స్టార్లు. గాయాలతో సతమతమవుతున్న పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా కూడా సహచరులతో కలసి నెట్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నాడు. అయితే చూడటానికి ఫిట్‌గా కనిపిస్తున్న బుమ్రా ఎన్ని మ్యాచులు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. 3 టెస్టులు ఆడతాడని సెలెక్టర్లు అంటున్నా.. అతడు ఒక్క ఓవర్ ఎక్కువ వేసినా డేంజరేనని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

డేంజర్..

బుమ్రా ఫిట్‌గా ఉండటం భారత జట్టుకు చాలా ముఖ్యమని లెజెండ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టీమిండియాకు అతడు ప్రధాన ఆయుధమని, అయితే అతడితో సుదీర్ఘంగా బౌలింగ్ చేయించొద్దని సూచించాడు. వికెట్ టేకర్‌గా అతడ్ని వాడుకోవాలని.. రోజులో 12 కంటే ఎక్కువ ఓవర్లు వేయించొద్దని కెప్టెన్ గిల్‌కు సూచించాడు దాదా. ఒక్క ఓవర్ ఎక్కువ వేసినా డేంజరే అన్నాడు. బుమ్రాను కాపాడుకుంటూ ఇతర బౌలర్లతో దూకుడుగా బౌలింగ్ చేయించాలన్నాడు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఆశిష్ కౌశిక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పని చేసిన ఆయన.. బుమ్రాతో చాలా జాగ్రత్తగా ఉండాలని, గాయాల బారి నుంచి అతడ్ని రక్షించుకోవాలన్నాడు.

జాగ్రత్తలు తప్పనిసరి..

‘ఆటగాళ్ల పనిభారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వర్క్‌లోడ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే గాయాలు తప్పవు. బుమ్రా లాంటి బౌలర్లు ఎంత ఎక్కువ బౌలింగ్ వేస్తే అంత ఇబ్బంది పడతారు. భవిష్యత్తులో వాళ్లు ఇదే రేంజ్‌లో బౌలింగ్ చేయలేరు. పనిభారంతో పాటు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ట్రెయినింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్.. ఇలా ఆటగాళ్లకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆశిష్ కౌషిక్ సూచించాడు. బుమ్రాతో ఎక్కువగా బౌలింగ్ చేయించొద్దని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది అని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 03:43 PM