Cricket Betting: బెట్టింగ్ భూతానికి యువకుడు బలి.. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో..
ABN, Publish Date - Apr 19 , 2025 | 08:39 PM
IPL Betting: బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఓ యువకుడు బెట్టింగ్ భూతం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
బెట్టింగ్ భూతం యువకుల్ని వదలడం లేదు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య పెరిగాయి. ఆన్‌లైన్ బెట్టింగ్, ఈజీ మనీ ఆశతో చాలా మంది డబ్బులు, ఆస్తులు పొగొట్టుకొని, ఆర్థిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. గణేష్ అనే 26 ఏళ్ల యువకుడు మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఏ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గణేష్.. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్ కారణంగానే గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. లోన్ యాప్స్, ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల పాలవడం కూడా అతడి సూసైడ్‌కు కారణాలని పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బెట్టింగ్ ఆడుతున్న కొందర్నీ ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలోని కోయలకుంట్లలో 6 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 లక్షల 10 వేల నగదు, 7 సెల్‌ఫోన్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
జీటీ దెబ్బకు పాయింట్స్ టేబుల్ షేక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 19 , 2025 | 09:05 PM