ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 Playoffs Scenario: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని మ్యాచులు నెగ్గాలి.. కటాఫ్ ఇదే..

ABN, Publish Date - Apr 25 , 2025 | 01:45 PM

Today IPL Match: ఐపీఎల్-2025 చూస్తుండగానే హాఫ్ సీజన్ అయిపోయింది. అన్ని జట్లు 8 మ్యాచులు ఆడేశాయి. దీంతో మెళ్లిగా అందరి ఫోకస్ ప్లేఆఫ్స్ వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ కటాఫ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Playoffs

ఐపీఎల్ నయా సీజన్ క్రమంగా ఆఖరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే సగం సీజన్ ముగిసింది. అన్ని టీమ్స్ 8 మ్యాచులు ఆడేశాయి. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అయితే 9 మ్యాచులు కంప్లీట్ చేసుకున్నాయి. ఇంకో వారంలో ప్లేఆఫ్స్ బెర్త్‌లపై దాదాపుగా కన్ఫర్మేషన్ వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్లేఆఫ్స్ కటాఫ్ ఎలా ఉంది.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఏ టీమ్ ఎన్ని మ్యాచులు నెగ్గాలి.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..


ఎన్ని గెలవాలంటే..

ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే గుజరాత్ టైటాన్స్ మరో 2 మ్యాచుల్లో విజయం సాధించాలి. ఆ టీమ్ ఇంకో 6 మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటిల్లో రెండు విక్టరీలు కొడితే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఆడాల్సిన 6 మ్యాచుల్లో 2 గెలుపులు సాధిస్తే సరిపోతుంది. వరుస విక్టరీలతో దూకుడు మీదున్న ఆర్సీబీ కూడా 5 మ్యాచుల్లో 2 విజయాలు నమోదు చేస్తే చాలు. ముంబై ఇండియన్స్ 5 మ్యాచుల్లో 3, పంజాబ్ కింగ్స్ 6 మ్యాచుల్లో మూడింట నెగ్గాల్సి ఉంటుంది. కేకేఆర్ 6 మ్యాచుల్లో ఐదింట గెలవాల్సి ఉంటుంది. టేబుల్‌లో దిగువన ఉన్న సన్‌రైజర్స్, సీఎస్‌కే ఆడే 6 మ్యాచుల్లోనూ భారీ తేడాతో విక్టరీలు కొట్టాలి. ఇక, వరుస పరాజయాలతో డీలాపడిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఆ టీమ్ నెక్స్ట్ ఆడే 3 మ్యాచుల్లోనూ గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేరదు.


ఇవీ చదవండి:

పాక్ అథ్లెట్‌కు ఆహ్వానం పంపడంపై విమర్శలు

సచిన్ కొడుకు మరో గేల్ అవుతాడు

పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 25 , 2025 | 01:49 PM