Arjun Tendulkar: అర్జున్‌ను యువరాజ్‌కి అప్పగిస్తే.. మరో క్రిస్‌గేల్ అవుతాడు: యువీ తండ్రి యోగ్‌రాజ్
ABN , Publish Date - Apr 24 , 2025 | 08:20 PM
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలర్ అనే సంగతి తెలిసిందే. 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుత ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. అతడిని మెగా వేలంలో రూ.30 లక్షలకు ముంబై టీమ్ కొనుగోలు చేసింది. అయితే అతడికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొడుకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) బౌలర్ అనే సంగతి తెలిసిందే. 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుత ఐపీఎల్ (IPL 2025)లో ముంబై ఇండియన్స్ (MI) జట్టులో ఉన్నాడు. అతడిని మెగా వేలంలో రూ.30 లక్షలకు ముంబై టీమ్ కొనుగోలు చేసింది. అయితే అతడికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే అర్జున్‌ను యువరాజ్ (Yuvraj Singh)కు అప్పగిస్తే అతడు మరో క్రిస్ గేల్ (Chris Gayle) అవుతాడని అతడి తండ్రి యోగ్‌రాజ్ (Yograj Singh) అభిప్రాయపడ్డాడు.
యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ వద్ద 2022లో కొన్ని నెలల పాటు అర్జున్ శిక్షణ తీసుకున్నాడు. తాజాగా అప్పటి సంగతులను యోగ్‌రాజ్ పంచుకున్నారు. అర్జున్ కెరీర్ గురించి మాట్లాడారు. * అర్జున్ బౌలింగ్ మీద కాకుండా బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. సచిన్ తన కుమారుడి గురించి యువరాజ్‌తో మాట్లాడాలి. అర్జున్‌ను యువీ దగ్గర కోచింగ్‌కు పంపిస్తే అతడు మరో క్రిస్ గేల్ అవుతాడని నేను పందెం వేస్తాను. అర్జున్‌కు ఆ సామర్థ్యం ఉంది. ఓ ఫాస్ట్ బౌలర్‌గా తరచుగా ఒత్తిడికి గురైతే బౌలింగ్ సరిగ్గా వెయ్యలేరు * అని యోగ్‌రాజ్ పేర్కొన్నారు.
2023లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్ ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అలాగే దేశవాళీ మ్యాచ్‌ల్లో కూడా అర్జున్ బ్యాటర్‌గా పెద్దగా రాణించింది లేదు. విజయ్ హాజారే ట్రోఫీ తాజా సీజన్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 40 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..