ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PBKS vs RCB Head To Head: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ .. ఫైనల్స్ వెళ్లేదెవరు? రికార్డులు ఏం చెబుతున్నాయి!

ABN, Publish Date - May 29 , 2025 | 04:08 PM

ఐపీఎల్-2025 ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు పోటీపడుతున్నాయి ఆర్సీబీ-పంజాబ్. ఈ రెండు టీమ్స్ నడుమ ఇవాళ జరిగే క్వాలిఫయర్-1లో గెలిచే జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అందుకే నెగ్గాల్సిందేనని ఇరు టీమ్స్ పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Playoffs

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్-2025లో ఈ జట్లది దాదాపుగా ఒకే రకమైన ప్రయాణం. రెండూ తొమ్మిదేసి విజయాలు సాధించాయి. ఆర్సీబీ ఓడినప్పుడు పంజాబ్ ఓడటం, ఇరు టీమ్స్ ఒకే సమయంలో విజయాల బాట పట్టడం, వర్షం వల్ల రెండు జట్ల మ్యాచులు రద్దవడం, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గి క్వాలిఫయర్‌-1లో చోటు దక్కించుకోవడం.. ఇలా బెంగళూరు-పంజాబ్ జర్నీ ఒకే విధంగా సాగింది. అయితే ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోలేదీ టీమ్స్. కానీ ఇప్పుడు సువర్ణావకాశం వచ్చింది. క్వాలిఫయర్-1లో నెగ్గితే.. కప్పుకు అడుగు దూరంలో నిలవొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ-పంజాబ్ జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


ఎవరిది పైచేయి..

బెంగళూరు-పంజాబ్ మధ్య ఇప్పటివరకు 35 మ్యాచులు జరిగాయి. ఇందులో 17 సార్లు ఆర్సీబీ నెగ్గగా.. 18 సార్లు పీబీకేఎస్ విక్టరీ కొట్టింది. హెడ్ టు హెడ్ రికార్డుల్లో ఒక్క విజయంతో పంజాబ్ కాస్త ముందంజలో ఉంది. రెండు జట్లు పోటీపడిన సందర్భాల్లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచులు చాలానే ఉన్నాయి. ఐపీఎల్‌లో బెస్ట్ రైవల్రీస్‌లో ఒకటిగా ఆర్సీబీ- పీబీకేఎస్‌ను చెప్పొచ్చు. అయితే హెడ్ టు హెడ్ రికార్డుల పరంగా పంజాబ్ ముందంజలో ఉన్నా.. ఫైనల్ రికార్డుల్లో మాత్రం కోహ్లీ టీమ్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు పంజాబ్ ఒక్కసారి మాత్రమే తుదిపోరుకు అర్హత సాధించింది. 2014లో ఫైనల్స్‌కు వెళ్లింది.


కప్పు కొట్టాలె..

ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్స్‌లో ఆడింది. 2009, 2011, 2016లో మెగాఫైట్‌లో తలపడిన ఘనత బెంగళూరుకు ఉంది. అయితే రెండు జట్లూ ఒక్క కప్పు కూడా కొట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ హేమాహేమీలుగా కనిపిస్తున్నాయి. కానీ ప్లేఆఫ్స్‌లో చాలాసార్లు ఆడిన అనుభవం, ఎక్కువసార్లు ఫైనల్స్‌కు వెళ్లిన రికార్డు ఉండటంతో ఇవాళ్టి పోరులో బెంగళూరు ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే ఏ టీమ్ ఫైనల్‌కు వెళ్లినా కప్పు కొట్టకపోతే మాత్రం రాత మారదనే చెప్పాలి. ఫైనల్‌కు చేరడం కాదు.. ట్రోఫీ కల నిజమైతేనే అభిమానులు సంతోషిస్తారు.


ఇవీ చదవండి:

రాసిపెట్టుకోండి.. కప్పు ఆర్సీబీదే..

పొల్లుపొల్లు కొట్టుకున్న క్రికెటర్లు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 04:11 PM