ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KKR Playoffs Chances: చెన్నై చేతుల్లో ఓడినా ఇంకా ప్లేఆఫ్స్ చాన్స్.. కేకేఆర్‌ కొట్టేస్తుందా..

ABN, Publish Date - May 08 , 2025 | 02:25 PM

Indian Premier League: సీఎస్‌కే‌తో బుధవారం జరిగిన పోరులో 2 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది కేకేఆర్. చివరి వరకు పోరాడినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

KKR Playoffs Chances

ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ ఇరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది సీఎస్‌కే. ఆఖరి ఓవర్ వరకు నువ్వా నేనా అంటూ సాగిన సమరంలో కొద్దిలో గెలుపును మిస్ చేసుకుంది రహానె సేన. దీంతో 12 మ్యాచుల్లో 11 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది కేకేఆర్. అయినా ఆ టీమ్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే ఆ టీమ్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..


ఒకవేళ గెలిచినా..

కేకేఆర్ ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఇంటిదారి పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మే 10వ తేదీన తలపడనుంది కోల్‌కతా. అయితే హైదరాబాద్‌లో వాన కురిసే చాన్స్ ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. అనే డౌట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్‌లో ఓడినా.. లేదా ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా రహానె సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఒకవేళ ఆ పోరులో నెగ్గినా.. మే 17వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. రెండింట్లో విజయం సాధించినా ప్లేఆఫ్స్ చేరుతుందనే గ్యారెంటీ లేదు. ఇతర జట్ల ఫలితాలపై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, కేకేఆర్ సొంత కష్టాన్ని నమ్ముకోవడంతో పాటు లక్ మీదా ఆధారపడక తప్పదు.


ఇవీ చదవండి:

కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్..

పాక్‌కు ఇచ్చిపడేసిన సానియా

ఎంతపని చేశావ్ రోహిత్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 08 , 2025 | 02:26 PM