IPL 2025 Trophy: కప్పును శాసిస్తున్న కుర్రాళ్లు.. ఇది మాత్రం ఊహించలేదు
ABN, Publish Date - May 15 , 2025 | 03:23 PM
IPL Young Cricketers: ఐపీఎల్ ఫ్రాంచైజీలు కుర్ర క్రికెటర్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. యంగ్ ప్లేయర్ల మీద మరింత ఫోకస్ చేస్తున్నాయి జట్లు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 మళ్లీ ప్రారంభమవుతోంది. మే 17వ తేదీన క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచులు స్టార్ట్ అవుతాయి. అయితే ఇకపై అంతా మారబోతోంది. ఈ సీజన్ ఫస్టాఫ్‌కు సెకండాఫ్‌కు చాలా తేడా ఉండబోతోంది. దీనికి ప్రధాన కారణం విదేశీ స్టార్లు మిస్ అవడమే. డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్ సిరీస్ వల్ల అటు ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా ఆటగాళ్లతో పాటు ఇటు ఇంగ్లండ్-విండీస్ నుంచి కీలక ప్లేయర్లు ఐపీఎల్ మిస్ అవుతున్నారు. దీంతో తొలి సగంలో రాణించిన కుర్రాళ్ల మీద గంపెడాశలు పెట్టుకున్నాయి అన్ని ఫ్రాంచైజీలు. మరి.. కప్పును శాసించబోతున్న ఆ యంగ్ గన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
సాయి సుదర్శన్: ఈ గుజరాత్ ఓపెనర్ ఈ సీజన్‌లో 11 మ్యాచుల్లో 509 పరుగులు చేశాడు. 5 హాఫ్ సెంచరీలు బాదిన సుదర్శన్.. మంచి ఊపు మీద ఉన్నాడు. జోస్ బట్లర్ గైర్హాజరీతో టెన్షన్ పడుతున్న జీటీకి సాయి పెద్ద దిక్కు కానున్నాడు.
సాయి కిషోర్: 14 వికెట్లతో జీటీ బౌలింగ్ యూనిట్‌కు ప్రధాన అస్త్రంగా మారాడు సాయి కిషోర్. తన స్పిన్ బౌలింగ్‌తో తోపు బ్యాటర్లను కూడా అతడు భయపెడుతున్నాడు.
ప్రభుసిమ్రన్ సింగ్: ఈ సీజన్‌లో పంజాబ్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు ప్రభుసిమ్రన్. 11 మ్యాచుల్లో 437 పరుగులతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఓపెనర్ మీద అయ్యర్ సేన గంపెడాశలు పెట్టుకుంది.
ప్రియాన్ష్ ఆర్య: పంజాబ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న మరో ఓపెనర్ ప్రియాన్ష్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 347 పరుగులతో సత్తా చాటిన లెఫ్టాండ్ బ్యాటర్.. ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
ప్రసిద్ధ్ కృష్ణ: జీటీ బౌలింగ్ అటాక్‌ను ముందుండి నడిపిస్తున్నాడు యువ కెరటం ప్రసిద్ధ్. 20 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇతడు గానీ నిలకడగా బ్రేక్‌త్రూలు అందిస్తూ పోతే గుజరాత్‌కు తిరుగుండదనే చెప్పాలి.
పైప్లేయర్లతో పాటు ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, అభిషేక్ పోరెల్ లాంటి ఇతర యువ ఆటగాళ్ల మీదా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఐపీఎల్ మిస్ కానున్న స్టార్లు వీళ్లే..
కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 15 , 2025 | 03:23 PM