ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై ధోని సడన్ షాక్.. ఇదేం ట్విస్ట్ భయ్యా

ABN, Publish Date - Apr 30 , 2025 | 09:11 PM

Indian Premier League: రిటైర్మెంట్‌పై బాంబు పేల్చాడు ఎంఎస్ ధోని. ఎవ్వరూ ఊహించని రీతిలో సడన్ షాక్ ఇచ్చాడు. అసలు మాహీ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై గత కొన్ని సీజన్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. వయసు మీద పడుతున్నా, మోకాలి గాయం ఇబ్బంది పెడుతున్నా ఎల్లో ఆర్మీ కోసం ఇంకా ఆడుతూ వస్తున్నాడు మాహీ. ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తూ బరిలోకి దిగి సీఎస్‌కే తరఫున అదరగొడుతున్నాడు. అయినా రిటైర్మెంట్ పుకార్లు ఆగడం లేదు. అయితే ఈసారి అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్‌లో పాత ధోనీని గుర్తుచేస్తుండటంతో అతడికి తిరుగులేదని అంతా అనుకున్నారు. అయితే రిటైర్మెంట్‌పై సడన్ షాక్ ఇచ్చాడు మాహీ. నెక్స్ట్ మ్యాచ్‌లో తాను ఆడకపోవచ్చునంటూ బాంబు పేల్చాడు. అసలు అతడు ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..


మాహీ ఏమన్నాడంటే..

చెపాక్ వేదికగా సీఎస్‌కే-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం చెన్నై బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. టాస్ ఓడిన ధోని మాట్లాడేందుకు రాగానే చెపాక్ స్టేడియం దద్దరిల్లింది. సీఎస్‌కే అభిమానులు ధోని.. ధోని.. అంటూ గట్టిగా అరిచారు. విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీంతో మాహీకి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నెక్స్ట్ ఇయర్ కూడా చెపాక్‌కు కచ్చితంగా వచ్చి ఆడతావు కదా అని ధోనీకి క్వశ్చన్ ఎదురైంది. దీనికి అతడు తనదైన స్టైల్‌లో వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కాదు.. నెక్స్ట్ మ్యాచ్‌కు వస్తానో.. లేదో కూడా తెలియదంటూ సస్పెన్స్‌లో పెట్టాడు. దీంతో ధోనీకి ఇదే చివరి మ్యాచా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి అంటూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే అతడు నవ్వుతూ మాట్లాడాడు కాబట్టి జోక్‌గా తీసుకోవాలని.. పక్కా నెక్స్ట్ ఇయర్ ఆడతాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

ఐపీఎల్ నుంచి మ్యాక్స్‌‌వెల్ ఔట్

ధోని.. ఇక దుకాణం మూసుకోవాల్సిందే

అఫ్రిదీకి భారత ప్రభుత్వం షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 09:14 PM