Share News

Glenn Maxwell: ఐపీఎల్ నుంచి మ్యాక్స్‌‌వెల్ అవుట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు ఏంటంటే

ABN , Publish Date - Apr 30 , 2025 | 09:02 PM

తాజా సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌‌వెల్ కేవలం 48 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడిని తప్పించాలని పంజాబ్ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ తప్పించిందంటూ వార్తలు మొదలయ్యాయి.

Glenn Maxwell: ఐపీఎల్ నుంచి మ్యాక్స్‌‌వెల్ అవుట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు ఏంటంటే
Glenn Maxwell

ఐపీఎల్-2025 (IPL 2025) నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell ) తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్ (PBKS) తరఫున ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌కు ఈ సీజన్ ఓ పీడకలగా మిగిలింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌‌వెల్ కేవలం 48 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడిని తప్పించాలని పంజాబ్ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ తప్పించిందంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే మ్యాక్స్‌‌వెల్ తప్పుకున్నది నిజమే గానీ, పంజాబ్ కింగ్స్ అతడిని తప్పించలేదు (Maxwell ruled out).

maxwell2.jpg


మ్యాక్స్‌వెల్ తప్పుకోవడం వెనుక గల కారణాన్ని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు వెల్లడించాడు (CSK vs PBKS). చేతి వేలికి గాయం కావడం వల్ల మ్యాక్స్‌వెల్ తప్పుకున్నాడని శ్రేయస్ స్పష్టం చేశాడు. ఈ సీజన్ మొత్తానికి మ్యాక్స్‌వెల్ దూరమవడంతో అతడిని వేరే ఆటగాడితో రీప్లేస్ చేయడం గురించి మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందని శ్రేయస్ తెలిపాడు. మరి, అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.


గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ టీమ్ 4.2 కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే జట్టు మేనేజ్‌మెంట్‌ను మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడనే వార్త రావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. మ్యాక్స్‌వెల్ వెళ్లిపోతుండడంతో పంజాబ్ కింగ్స్‌కు మంచి రోజులు మొదలైనట్టేనని ఒకరు కామెంట్ చేశారు. మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో ఆడుతున్నాడా అని మరొకరు ప్రశ్నించారు. మ్యాక్స్‌వెల్ దూరం కావడంతో ఇతర జట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఇంకొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

MS Dhoni: చెన్నై టీమ్ మెరుగుపడాలంటే.. ధోనీ రిటైర్ కావడం మంచిది: ఆడమ్ గిల్‌క్రిస్ట్


IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే


మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 09:02 PM