ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 Points Table: పాయింట్స్ టేబుల్ షేక్.. సీఎస్‌కేకు క్రెడిట్ ఇవ్వాల్సిందే!

ABN, Publish Date - May 25 , 2025 | 07:45 PM

ఒకే ఒక్క గెలుపుతో పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ టైటాన్స్ ఆశల్ని ఆవిరి చేసింది మాహీ టీమ్. ఇతర జట్లకు బంపర్ చాన్స్ ఇచ్చింది. దీని గురించి మరింతగా ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2025 Points Table

ఐపీఎల్-2025 ఆసాంతం వరుస ఓటములతో అభిమానుల్ని పూర్తిగా నిరుత్సాహానికి గురిచేస్తూ వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. గెలవడమే మర్చిపోయినట్లు ఆడింది సీఎస్‌కే. అయితే అనూహ్యంగా ఆఖరి మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది. అదీ టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ మీద కావడం గమనార్హం. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన పోరులో జీటీని 83 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది మాహీ సేన. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న గుజరాత్‌కు ఇది మాస్టర్‌స్ట్రోక్ అనే చెప్పాలి. అయితే ఇక్కడితో అయిపోలేదు.. ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసేసింది చెన్నై. ఇతర జట్లకు అనూహ్య అవకాశాలను కల్పించిందా టీమ్. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..


మూడు జట్లకూ చాన్స్!

గుజరాత్‌పై గెలిచినా పాయింట్స్ టేబుల్‌లో సీఎస్‌కే స్థానం మారలేదు. 14 మ్యాచుల్లో 4 విజయాలతో ఉన్న మాహీ సేన.. ఆఖరి స్థానంతో సీజన్‌ను ముగించింది. అయితే ప్లేఆఫ్స్ సినారియోను మాత్రం చెన్నై మార్చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జీటీ ఇంకా టాప్‌లోనే కొనసాగుతోంది. 14 మ్యాచుల్లో 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది గిల్ సేన. కానీ తదుపరి స్థానాల్లో ఉన్న పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్-ముంబై తలపడనున్నాయి. ఇందులో గెలిచిన టీమ్ క్వాలిఫయర్ పోరుకు అర్హత సాధిస్తుంది. ఓడిన టీమ్ ఎలిమినేటర్‌కు వెళ్తుంది. అటు ఆర్సీబీ-ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో కోహ్లీ జట్టు గనుక నెగ్గితే క్వాలిఫయర్-1లో ఆడుతుంది. ఒకవేళ ఈ పోరులో లక్నో గెలిస్తే జీటీ క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తుంది. గుజరాత్‌ను చెన్నై చిత్తు చేయడంతో పంజాబ్, ఆర్సీబీ, ముంబైకి టాప్‌ ప్లేస్‌కు చేరుకునే అవకాశం దక్కింది. క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ బెర్త్‌లను సస్పెన్స్‌లో పడేసింది సీఎస్‌కే.


ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 07:55 PM