ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cheteshwar Pujara: నా భర్త కోసం స్కెచ్ వేశారు.. పుజారా భార్య సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 30 , 2025 | 05:26 PM

Puja Pabari: టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీల మీద సెంచరీలతో టీమిండియాను టెస్టుల్లో టాప్ టీమ్‌గా నిలపడంలో ఎంతో కృషి చేశాడు ఛతేశ్వర్ పుజారా. అయితే కొన్నాళ్లుగా అతడు టీమ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలో అతడి సతీమణి పూజా పబరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏమందంటే..

Cheteshwar Pujara

ఛతేశ్వర్ పుజారా.. టెస్టుల్లో భారత్ సూపర్ పవర్‌గా ఎదగడంలో కీలకపాత్ర పోషించిన ప్లేయర్. టన్నుల కొద్దీ పరుగులు, లెక్కకు మించిన సెంచరీలతో టీమిండియాకు రియల్ హీరోగా నిలిచాడు. లాంగ్ ఫార్మాట్‌లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో స్తంభంలా నిలబడిపోయి మెన్ ఇన్ బ్లూకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. అయితే గత రెండేళ్లుగా అతడు టీమ్‌కు దూరంగా ఉంటున్నాడు. పుజారా ప్లేస్‌లో యంగ్‌స్టర్స్‌కు చాన్సులు ఇస్తోంది బీసీసీఐ. అయితే ఒకప్పుడు తోపు ప్లేయర్‌గా టీమిండియాకు అన్నీ తానై నిలిచిన పుజారా కెరీర్ ఇలా అయిపోవడం వెనుక పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా.. లాంటి డిస్కషన్స్ చాన్నాళ్లుగా నడుస్తున్నాయి. నా భర్త కోసం స్కెచ్ వేశారంటూ తాజాగా పుజారా సతీమణి చేసిన సంచలన వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోంది. అసలు నయా వాల్ వైఫ్ ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..


తట్టుకోలేకపోయిన పుజారా..

పుజారా భార్య పూజా పబరి రాసిన ది డైరీ క్రికెటర్స్ వైఫ్ పుస్తకం ఇటీవలే రిలీజ్ అయింది. ఇందులో భర్త క్రికెట్ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు రాసుకొచ్చింది పూజా. 2018-19 ఆస్ట్రేలియా టూర్ హైలైట్స్‌‌నూ ఇందులో షేర్ చేసింది. జట్టులోని ఓ వ్యక్తే అతడ్ని తీసేయాలని అనుకున్నాడట. ఇది తెలిసిన స్టార్ బ్యాటర్ చాలా హర్ట్ అయ్యాడట. ఆ టూర్‌లో అడిలైడ్ టెస్ట్‌లో సెంచరీ (123) తో పాటు హాఫ్ సెంచరీ (71)తో సిరీస్‌లో భారత్ లీడ్ తీసుకోవడంలో పుజారా కీలకపాత్ర పోషించాడు. అయితే పెర్త్ టెస్ట్‌లో అతడు విఫలమయ్యాడు. టీమిండియా ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో పుజారాను దింపేయాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని టీమ్‌లోని ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతుండగా పుజారా విని బాధపడ్డాడట.


ఎవరా వ్యక్తి..

అప్పటి ఆసీస్ టూర్‌లో ఒకవైపు గాయంతో ఇబ్బంది పడుతూనే.. మరోవైపు తండ్రి ఆరోగ్య సమస్యను కూడా దాచాడట పుజారా. టీమ్ కోసం పెయిన్‌ను నొప్పి కింద భరిస్తూ ఆటను కొనసాగించాడట. కానీ టీమ్‌లో నుంచి అతడ్ని పక్కనబెట్టాలని ప్రయత్నించడంతో బాగా హర్ట్ అయ్యాడట. ఈ విషయం అతడి సతీమణి పూజా పబరికి తెలియడంతో ఏమైందని అడిగిందట. నువ్వు పొగిడే ఓ వ్యక్తి ఫిట్‌నెస్ కారణాలతో నన్ను టీమ్‌లో నుంచి తీసేయాలని అనుకున్నాడని రివీల్ చేశాడట పుజారా. ఇది విని షాకైందట అతడి వైఫ్. అదే విషయాన్ని తాజా పుస్తకంలో బయటపెట్టింది. దీంతో పుజారా కెరీర్‌ను నమ్మిన వాళ్లే నాశనం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి కెరీర్ ఇలా అయిపోవడానికి టీమ్‌లోని ఎవరో పర్సన్ కారణమనే పుకార్లు ఎక్కువయ్యాయి. మరి.. ఆ వ్యక్తి ఎవరనేది పుజారా రివీల్ చేస్తాడేమో చూడాలి.


ఇవీ చదవండి:

రింకూ చెంప చెల్లుమనిపించిన కుల్దీప్

రింకూను కావాలనే కొట్టాడా..

ధవన్ దెబ్బకి పాక్ లెజెండ్ షేక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 05:35 PM