Shikhar Dhawan: గబ్బర్ ఘాటు జవాబు..అఫ్రిదీ వ్యాఖ్యలపై ధావన్ దెబ్బకి దద్దరిలిన పాక్ లెజెండ్
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:09 PM
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది భారతదేశంపై అనేక ఆరోపణలు చేశాడు. ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని ఎద్దేవా చేశాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ స్పందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
జమ్ము కశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారతదేశంలో ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో అనేక మంది దీనిపై స్పందిస్తున్నారు. ఇండియాలో ఉండి కూడా ఎవరైనా పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడితే అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అన్న వ్యక్తిని కొట్టి చంపేశారు. పాకిస్తాన్‌పై ప్రజలు ఏ స్థాయిలో కోపంతో ఉన్నారో దీనిని బట్టి చూస్తే అర్థమవుతుంది.
ఇదే సమయంలో పాకిస్తాన్ నుంచి కూడా పలువురు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సోషల్ మీడియాలో భారత సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ దాడి గురించి భారతదేశం రుజువు చూపించాలని, భారత సైన్యం అనేక మంది ప్రాణాలను తీస్తోందని ఆరోపించాడు. ఆయన ప్రకటనపై అనేక విమర్శలు వచ్చాయి.
ముందు అభివృద్ధిపై
ఇదే సమయంలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా స్పందించారు. అనవసరమైన వ్యాఖ్యలు చేయడానికి బదులుగా, మీ దేశ పురోగతిపై దృష్టి పెట్టడం మంచిదని ధావన్ సూచించారు. ఆ క్రమంలో షాహిద్ అఫ్రిదిని ట్యాగ్ చేశాడు. ఇంకా వ్రాస్తూ భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉందని, భారత మాతా కీ జై! జై హింద్!" అని పేర్కొన్నారు. పహల్గామ్ దాడికి సంబంధించి భారత క్రికెట్ జట్టు ఇప్పటికే సంతాపం తెలిపింది. ఈ దాడి నేపథ్యంలో అనేక మంది సంతాపం వ్యక్తం చేశారు.
బంధించిన ఘటనలో
ధావన్ ఈ ప్రకటన తర్వాత, అఫ్రిది మరోసారి ఆ పోస్ట్‌ను షేర్ చేసి వ్యాఖ్యానించారు. ఈసారి ఆయన గెలుపు, ఓటమి గురించి మర్చిపో, రండి, నేను మీకు టీ అందిస్తా శిఖర్" అని అఫ్రిది రాశాడు. 2019లో పాకిస్తాన్ వైమానిక దళం భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను బంధించిన ఘటన నేపథ్యంలో అఫ్రిది టీ గురించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విచారణ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆయనకు టీ అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో అలా స్పందించడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో అఫ్రిదిపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గతంలో పిలుపునిచ్చారు. అంతేకాదు పాకిస్తాన్‌తో 100 శాతం అన్ని రకాల సంబంధాలను కట్ చేయాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..