Bazball In Edgbaston: మేమేం పిచ్చోళ్లం కాదు.. ఇంగ్లండ్ కోచ్ షాకింగ్ కామెంట్స్!
ABN, Publish Date - Jul 06 , 2025 | 02:14 PM
తామేమీ పిచ్చోళ్లం కాదంటూ ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తమకేం చేయాలో బాగా తెలుసునని అన్నాడు. అసలు ట్రెస్కోథిక్ ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..
బజ్‌బాల్ క్రికెట్‌తో ప్రత్యర్థులను భయపెడుతూ వస్తోంది ఇంగ్లండ్. టెస్టులను టీ20లు మార్చేసిన స్టోక్స్ సేన.. రిజల్ట్ రాబట్టాలనే ఉద్దేశంతో ఆడుతోంది. బాదుడు మంత్రంతో వార్‌ను వన్ సైడ్ చేస్తోంది. అయితే బజ్‌బాల్ ఫార్ములా వాళ్లకు బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఫార్ములా విషయంలో వాళ్లు రివర్స్ గేర్ వేయడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. భారత్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఓటమి అంచున ఉంది ఇంగ్లండ్. 608 పరుగుల లక్ష్య ఛేదనలో 72 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఆ జట్టు బజ్‌బాల్‌ను ప్రయోగిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డ్రా అయితే..
ఇంగ్లండ్ బజ్‌బాల్ ఫార్ములాను ఉపయోగించే ధైర్యం చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఆ టీమ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ తాజాగా స్పందించాడు. తామేమీ పిచ్చోళ్లం కాదని.. డ్రా ధ్యేయంగా ఆడతామని స్పష్టం చేశాడు. తాము ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆడాలని అనుకుంటామని, ఎడ్జ్‌బాస్టన్‌లోనూ అదే విధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపాడు. భారత్ సంధించిన లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టమని.. ఒక్కరోజులో 550 పరుగులు చేయడం మామూలు విషయం కాదన్నాడు ట్రెస్కోథిక్. మొదటి 15 ఓవర్ల ఆట తర్వాతే మ్యాచ్ ఎలా ముందుకు సాగుతుందనేది తెలుస్తుందని, పిచ్ ప్రవర్తించే తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ డ్రా అయితే తమకు సంతోషమేనని పేర్కొన్నాడు. అయితే తమ బ్యాటర్లు పోరాటం మాత్రం ఆపబోరని వ్యాఖ్యానించాడు.
ఇవీ చదవండి:
టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 06 , 2025 | 02:20 PM