Morne Morkel Satires: ఔను.. చేజ్ చేస్తారు.. టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:30 PM
భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఔను.. చేజ్ చేసేస్తారంటూ ఇంగ్లండ్ పరువు తీశాడు. అసలేం జరిగిందంటే..

బజ్‌బాల్ ఫార్ములాతో టెస్ట్ దేశాలను భయపెడుతోంది ఇంగ్లండ్. ధనాధన్ ఆటతీరుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో రచ్చ చేస్తోంది. డ్రాకు తావివ్వకుండా మ్యాచ్‌లో రిజల్ట్ రాబట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది స్టోక్స్ సేన. గెలుపో, ఓటమో ఏదో ఒకటి తేలాల్సిందే అనే ధోరణితో ఆడుతోంది. అయితే ఈ క్రమంలో వరుస విజయాలు రావడం, బజ్‌బాల్ ఫార్ములా సక్సెస్ అవడంతో ఓవరాక్షన్ చేస్తోంది. ఎంత స్కోరైనా ఛేదిస్తామంటూ బిల్డప్ ఇస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లోనూ తాము ఎంత లక్ష్యమైనా ఛేజ్ చేస్తామంటూ ఆ టీమ్ ప్లేయర్లు, మేనేజ్‌మెంట్ కామెంట్స్ చేశారు. దీంతో వాళ్లకు ఇచ్చిపడేశాడు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్. ఔను.. నిజమే, చేజ్ చేస్తారంటూ ఆ టీమ్ గాలి తీసేశాడు.
కూల్చేస్తాం..
ఔను.. ఎప్పటిలాగే ఇంగ్లండ్ ఛేజింగ్ చేస్తుందంటూ సెటైర్ వేశాడు మోర్కెల్. ఎంత స్కోరు అయినా వాళ్లు ఛేదనలో బాదుడు మంత్రంతో ఆడతారనే విషయం తమకూ తెలుసునని అన్నాడు. పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు సహకరిస్తున్నందున అటాకింగ్ ప్లేయర్లతో నిండిన ఇంగ్లండ్.. తప్పకుండా వాళ్ల తరహాలోనే బ్యాటింగ్ చేస్తుందని మోర్కెల్ తెలిపాడు. అయితే తమ దగ్గర సిరాజ్, ఆకాశ్‌దీప్ రూపంలో అద్భుతమైన పేస్ అటాక్ ఉందని.. ప్రత్యర్థిని ఎలా కూల్చాలో తమకు తెలుసునంటూ హెచ్చరికలు చేశాడు మోర్కెల్.
క్రెడిట్ ఇవ్వాల్సిందే..
‘సిరాజ్ అద్భుతమైన బౌలర్. అతడి ఎనర్జీ, అగ్రెషన్, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయి. ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేసినా ఇంకో ఓవర్ వేసేందుకు అతడు సిద్ధంగా ఉంటాడు. ఒక్కోసారి వికెట్ల కోసం కాస్త ఎక్కువగా ప్రయత్నించి భంగపడతాడు. కానీ చాలా వరకు అతడు తన బలాన్ని నమ్ముకొని బంతులేస్తూ బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. దీనికి అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మరో పేసర్ ఆకాశ్‌దీప్ అటాకింగ్ బౌలర్. స్టంప్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులు వేస్తూ బ్యాటర్లకు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాడు. అతడి బౌలింగ్ శైలికి ఇక్కడి పరిస్థితులు సెట్ అవుతాయి. రూట్‌ను అతడు ఔట్ చేసిన బంతి డ్రీమ్ డెలివరీ. అతడేం చేయగలడనే దానికి ఆ బంతే నిదర్శనం’ అంటూ మోర్కెల్ మెచ్చుకున్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి