Share News

Shubman Gill Fear Of Bazball: బజ్‌బాల్‌కు భయపడిన గిల్.. ఇంత చేసినా తప్పని తిట్లు!

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:04 AM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఇంకో 7 వికెట్లు తీస్తే సిరీస్‌లో బోణీ కొట్టడం ఖాయం. అయితే నాలుగో రోజు ఆటలో సారథి శుబ్‌మన్ గిల్ తీసుకున్న పలు నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.

Shubman Gill Fear Of Bazball: బజ్‌బాల్‌కు భయపడిన గిల్.. ఇంత చేసినా తప్పని తిట్లు!
Shubman Gill

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విజయం ముంగిట నిలుచుంది భారత్. రెండో ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసిన టీమిండియా.. 608 పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 72 పరుగులతో ఉంది. ఇంకా ఒక రోజు మిగిలి ఉంది. ఐదో రోజు భారత్ విజయానికి 7 వికెట్లు కావాలి. అదే ఆతిథ్య జట్టు నెగ్గాలంటే ఇంకా 536 పరుగులు చేయాలి. ఇప్పటికే క్రాలే, డకెట్, రూట్ ఔటైన నేపథ్యంలో ఇంగ్లండ్ డ్రా చేసుకున్నా గొప్పే అనుకుంటోంది. ఓటమి బారి నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్టోక్స్ సేనను చూసి భారత కెప్టెన్ టెన్షన్ పడటం చర్చనీయాంశంగా మారింది.


ఎందుకింత భయం?

ఇన్నింగ్స్ డిక్లరేషన్ విషయంలో టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. భారత ఆధిక్యం 500 దాటినా అతడు డిక్లేర్ చేయలేదు. 600 మార్క్‌ను అందుకున్నాకే డిక్లేర్ చేసి.. ఇంగ్లండ్‌ను ఛేదనకు ఆహ్వానించాడు గిల్. దీంతో అతడు ఎందుకు ఇంత డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. బజ‌్‌బాల్‌కు ఎందుకింత భయపడుతున్నాడని క్వశ్చన్ చేస్తున్నారు.


డ్రా అయితే..!

ఇంకో అరగంట ముందు డిక్లేర్ చేసి ఉంటే సిరాజ్-ఆకాశ్‌దీప్‌కు మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసేందుకు లభించేవని.. తద్వారా ఇంకో ఒకట్రెండు వికెట్లు తీసేందుకు అవకాశం దక్కేదని నెటిజన్స్ అంటున్నారు. ఆట ఐదో రోజు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి ఓవర్లు సాధ్యం కాకపోవచ్చు. ఈ కారణంగా ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే దానికి గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యత తీసుకుంటారా? అని నెటిజన్స్ నిలదీస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం గిల్ చేసింది కరెక్ట్ అని.. ఇంగ్లండ్‌కు ముకుతాడు వేయాలంటే కొండంత స్కోరు సెట్ చేసి, అటాక్ చేయాలని చెబుతున్నారు. పరుగులు పోయినా ఫర్వాలేదు.. వికెట్లు తీయడమే ధ్యేయంగా అగ్రెసివ్ అప్రోచ్‌తో భారత్ ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. వరుస సెంచరీలతో అదరగొడుతున్న కెప్టెన్‌ను ఈ విషయంలో అనవసరంగా విమర్శించొద్దని కోరుతున్నారు.


ఇవీ చదవండి:

ఫుట్‌బాల్ ప్రపంచంలో కుదుపు!

డిక్లేర్ చేయమంటూ ఓవరాక్షన్

నా ఈవెంట్‌ నాదే టైటిల్‌

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 11:10 AM