Harry Brook Draw Talk: డిక్లేర్ చేయమంటూ బ్రూక్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన గిల్!
ABN , Publish Date - Jul 06 , 2025 | 09:03 AM
డ్రా చేయండి అంటూ టీమిండియాను రెచ్చగొట్టాడు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్. అయితే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు సారథి శుబ్‌మన్ గిల్.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విజయానికి చేరువలో ఉంది టీమిండియా. నాలుగో రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం సాధించింది గిల్ సేన. అన్ని సెషన్లలో భారత్ డామినేషనే నడిచింది. నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన మెన్ ఇన్ బ్లూ.. 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. డే-4 పూర్తయ్యే సరికి 72 పరుగులకు 3 వికెట్లతో ఉంది. అయితే భారత డిక్లరేషన్‌కు ముందు గిల్‌ను బ్రూక్ రెచ్చగొట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
వర్షం ఖాయమంటూ..
నాలుగో రోజు ఆటలో భారత్ ఎప్పుడెప్పుడు స్కోరును డిక్లేర్ చేస్తుందా అని అంతా ఎదురు చూశారు. అయితే ఆధిక్యం 450 దాటినా కెప్టెన్ గిల్ డిక్లరేషన్‌పై ఆసక్తి చూపలేదు. అప్పటికే బౌలింగ్ వేసి వేసి బాగా అలసిపోయారు ఇంగ్లండ్ బౌలర్లు. ఆ జట్టు ఫీల్డర్లు కూడా ఎప్పుడు డిక్లరేషన్ ఇస్తారా అంటూ వేచి చూడసాగారు. కానీ గిల్ మాత్రం బ్యాటింగ్ కొనసాగిస్తూనే పోయాడు. దీంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన ప్రత్యర్థి ఆటగాడు హ్యారీ బ్రూక్.. డిక్లరేషన్ ఇవ్వొచ్చు కదా అంటూ గిల్‌ను రెచ్చగొట్టాడు. లీడ్ 450 దాటింది డిక్లేర్ చేసేయండి.. రేపు ఎలాగూ వర్షం పడుతుంది అంటూ ఓవరాక్షన్ చేశాడు.
గేర్లు మార్చి..
‘ఆధిక్యం 450 దాటింది. రేపు తప్పకుండా వాన పడుతుంది. మధ్యాహ్నం నుంచి వర్షం కురవడం ఖాయం’ అంటూ గిల్‌ను రెచ్చగొట్టాడు బ్రూక్. అతడికి భారత సారథి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. మా బ్యాడ్ లక్ అని అన్నాడు. దీంతో డ్రాకు ఒప్పుకోండి అంటూ గిల్‌ను మళ్లీ రెచ్చగొట్టాడు బ్రూక్. ఆ తర్వాత గేర్లు మార్చిన గిల్ ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో 162 బంతుల్లో 13 బౌండరీలు, 8 సిక్సులతో 161 పరుగుల సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ దెబ్బకు బ్రూక్ నోరెళ్లబెట్టాడు. ఎట్టకేలకు 427/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది భారత్. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మన బౌలర్లు చుక్కలు చూపించారు. క్రాలే, డకెట్, రూట్‌ను ఔట్ చేసి విజయానికి చేరువ చేశారు.
ఇవీ చదవండి:
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి