Share News

Wimbledon: సినర్‌ జొకో సులువుగా

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:49 AM

వింబుల్డన్‌లో ఓ వైపు సీడెడ్‌లు ఒకరివెంట ఒకరు నిష్క్రమిస్తుండగా మరో పక్క స్టార్లు దూసుకు పోతున్నారు. టాప్‌ సీడ్‌లు జానిక్‌ సినర్‌, ఆర్యాన సబలెంక, ఆరో సీడ్‌ జొకోవిచ్‌, ఎనిమిదో సీడ్‌...

Wimbledon: సినర్‌ జొకో సులువుగా

  • ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశం

  • సబలెంక,స్వియటెక్‌ కూడా

  • డిఫెండింగ్‌ చాంప్‌ క్రెజికోవా ఇంటికి

లండన్‌: వింబుల్డన్‌లో ఓ వైపు సీడెడ్‌లు ఒకరివెంట ఒకరు నిష్క్రమిస్తుండగా మరో పక్క స్టార్లు దూసుకు పోతున్నారు. టాప్‌ సీడ్‌లు జానిక్‌ సినర్‌, ఆర్యాన సబలెంక, ఆరో సీడ్‌ జొకోవిచ్‌, ఎనిమిదో సీడ్‌ స్వియటెక్‌ వరుస సెట్ల విజయాలతో రౌండ్‌-16లో ప్రవేశించారు. అయితే 2022 చాంపియన్‌, 11వ సీడ్‌ ఎలెనా రిబకినా, నిరుటి విజేత బార్బరా క్రెజికోవా మూడో రౌండ్‌లో పరాజయం పాలయ్యారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో సినర్‌ 6-1, 6-3, 6-1తో పెట్రో మార్టినేజ్‌ని, జొకోవిచ్‌ 6-3, 6-0, 6-4తో కెక్‌మనోవిచ్‌ను చిత్తు చేసి ప్రీక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 11వ సీడ్‌ డిమినార్‌ 6-4, 7-6 (5), 6-3తో హోమ్‌గ్రెన్‌ని, 22వ సీడ్‌ కొబోలి 6-2, 6-4, 6-2తో 15వ సీడ్‌ మెన్సిక్‌ని, 19వ సీడ్‌ డిమిత్రోవ్‌ 6-3, 6-4, 7-6 (0)తో సెబాస్టియన్‌ని ఓడించారు. ఇక మహిళల సింగిల్స్‌లో..ప్రపంచ నెం.1 సబలెంక 7-6 (6), 6-4తో బ్రిటన్‌ స్టార్‌ ఎమ్మా రదుకాను ఆట కట్టించగా, ఐదు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌ స్వియటెక్‌ 6-2, 6-3తో డానిలి కొలిన్స్‌పై సునాయాసంగా నెగ్గి రౌండ్‌-16కు చేరారు. మరో మూడో రౌండ్‌ మ్యాచ్‌లో 23వ సీడ్‌ టాసన్‌ 7-6 (6), 6-3తో 11వ సీడ్‌ రిబకినాకు షాకిచ్చింది. డిఫెండింగ్‌ చాంపియన్‌, 17వ సీడ్‌ క్రెజికోవా 6-2, 3-6, 4-6తో 10వ సీడ్‌ ఎమ్మా నవారో చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 24వ సీడ్‌ మెర్టెన్స్‌ 6-1, 7-6 (6) 14వ సీడ్‌ స్విటోలినాపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ ఆండ్రీవా 6-1, 6-3తో బాప్టి్‌స్టని, 18వ సీడ్‌ అలెగ్జాండోవా 6-3, 7-6 (1)తో సోనెజ్‌ని, 19వ సీడ్‌ సంసనోవా 6-2, 6-3తో 16వ సీడ్‌ కసట్కినాని ఓడించి ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి అడుగు పెట్టారు.


యుకీ జోడీ ముందంజ: యుకీ భాంబ్రీ/గాలోవే (అమెరికా) జోడీ డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరింది. రెండో రౌండ్‌లో భాంబ్రీ జంట 6-3, 7-6 (6)తో పోర్చుగల్‌ ద్వయం బోర్గె్‌స/గిరాన్‌పై విజయం సాధించింది. శ్రీరామ్‌ బాలాజీ/మెక్సికోకు చెందిన మిగ్వెయిల్‌ రేయస్‌, రిత్విక్‌/నికొలాస్‌ (కొలంబియా) జోడీలు మాత్రం రెండో రౌండ్‌ నుంచే వెనుదిరిగాయి. నాలుగో సీడ్‌ అర్జెంటీనా, స్పెయిన్‌ జంట జెబలో్‌స/మార్సెల్‌తో జరిగిన పోరులో బాలాజీ జోడీ 4-6, 4-6తో పరాజయం పాలైంది. రిత్విక్‌ ద్వయం 4-6, 6-7 (9)తో బ్రిటన్‌ జంట శాలి్‌సబరీ/కు్‌పస్కీ చేతిలో ఓడింది.

ఇవీ చదవండి:

ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్

సంజూ శాంసన్‌కు జాక్‌పాట్

టచ్ చేయలేని రికార్డులు!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 03:49 AM