Share News

Phil Salt: ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్.. ఉతికి ఆరేశాడు భయ్యా!

ABN , Publish Date - Jul 05 , 2025 | 02:03 PM

ఓ ఆర్సీబీ బ్యాటర్ రెచ్చిపోయి ఆడాడు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో వార్ వన్ సైడ్ చేశాడు.

Phil Salt: ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్.. ఉతికి ఆరేశాడు భయ్యా!
Phil Salt

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సులతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. వైటాలిటీ బ్లాస్ట్ 2025లో భాగంగా నార్తాంప్టన్‌షైర్-లాంకాషైర్ జట్ల మధ్య జరిగిన పోరులో విజృంభించి ఆడాడు సాల్ట్. 57 బంతుల్లోనే 80 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 140 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఈ చిచ్చరపిడుగు.. 8 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. అతడితో పాటు మరో స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (42 బంతుల్లో 54) కూడా అదరగొట్టాడు.

Phill Salt


కథ ముగించారు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్‌షైర్ 20 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌట్ అయింది. వెటరన్ బ్యాటర్ రవి బొపారా (32), జస్టిన్ బ్రాడ్ (30), సైఫ్ జైబ్ (32) ఫర్వాలేదనిపించారు. సకీబ్ మహమూద్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఆ తర్వాత ఛేదన మొదలుపెట్టిన లాంకాషైర్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. సాల్ట్-బట్లర్ కలసి కథ ముగించారు. అయితే మ్యాచ్‌లో హైలైట్ అంటే సాల్ట్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశాడతను. తనకు బౌలింగ్ చేయాలంటే భయపడేలా చేశాడు. గ్రౌండ్‌కు నలువైపులా షాట్లు బాదాడు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాల్లేకుండా అందరి బౌలింగ్‌లో దంచికొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో తాను ఎంత ప్రమాదకర బ్యాటర్ అనేది సాల్ట్ మరోమారు నిరూపించాడు. పించ్ హిట్టింగ్‌తో వార్ వన్ సైడ్ చేసేశాడు.


ఇవీ చదవండి:

సంజూ శాంసన్‌కు జాక్‌పాట్

టచ్ చేయలేని రికార్డులు!

భారత్‌తో పెట్టుకుంటే ఇట్లుంటది!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 02:06 PM