Sanju Samson Record Bidding: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్.. రికార్డు ధర పలికిన స్టార్ బ్యాటర్!
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:38 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ రికార్డు ధర పలికాడు. వేలంలో ఎవరికీ దక్కనంత ప్రైజ్‌ను అతడు సొంతం చేసుకున్నాడు. మరి.. ఏ ఆక్షన్‌లో శాంసన్ రికార్డులు సృష్టించాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా వికెట్ కీపర్, ఓపెనర్ సంజూ శాంసన్ రికార్డు ధర పలికాడు. సగం బిడ్డింగ్ మొత్తాన్ని కేవలం ఈ స్టార్ బ్యాటర్ కోసమే వెచ్చించిందో ఫ్రాంచైజీ. అతడ్ని రూ.26.8 లక్షల ధర చెల్లించి సొంతం చేసుకుంది. కోట్లు పలికే సంజూకు ఇంత తక్కువ అమౌంట్ దక్కితే రికార్డు ఎలా అయిందనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. ఇది కేరళ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పొట్టి ఫార్మాట్‌లో స్థానికంగా లీగ్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే నిర్వహిస్తున్న కేరళ క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఆక్షన్ తాజాగా జరిగింది. ఇందులో శాంసన్ అత్యధిక ధరకు అమ్ముడుబోయాడు.
సంజూ కోసం సగం డబ్బు..!
కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు రూ.26.8 లక్షల ధరకు సంజూ శాంసన్‌ను సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుబోయిన ఆటగాడిగా సంజూ చరిత్ర సృష్టించాడు. గతంలో ఎంఎస్ అఖిల్ (రూ.7.4 లక్షలు-త్రివేండ్రం రాయల్స్) పేరిట ఉన్న రికార్డును సంజూ చెరిపేశాడు. కాగా, కేరళ క్రికెట్ లీగ్ వేలంలో ప్రతి జట్టు రూ.50 లక్షల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అయితే కొచ్చి బ్లూ టైగర్స్ తమ పర్స్‌లోని సగం కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం సంజూ కోసమే ఖర్చు చేసేసింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతూ కోట్లు గడిస్తున్న సంజూకు ఇది చాలా తక్కువ మొత్తమే కావొచ్చు. కానీ ఆడుతున్నది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కాబట్టి అక్కడ మరో రికార్డును సృష్టించడంపై అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది సూపర్ రికార్డ్ అని అంటున్నారు. ఇకపోతే, వచ్చే ఐపీఎల్‌లో రాజస్థాన్ నుంచి చెన్నైకి సంజూ మారతాడని రూమర్స్ వస్తున్నాయి. సీఎస్‌కే అతడి కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
భారత్‌తో పెట్టుకుంటే ఇట్లుంటది!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి