Share News

Gukesh Victory: ఏంటిది మాగ్నస్.. ఓటమి ఒప్పుకోవడానికి ఇంత భయమా..

ABN , Publish Date - Jul 05 , 2025 | 08:01 AM

Gukesh Victory: ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్‌ను గుకేష్ ఒకసారి కాదు.. రెండు సార్లు ఓడించాడు. జులై మూడవ తేదీన జరిగిన సూపర్ యునైటెడ్ రాపిడ్ అండ్ బ్లిండ్జ్ టోర్నమెంట్‌లో కూడా మాగ్నస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు.

Gukesh Victory: ఏంటిది మాగ్నస్.. ఓటమి ఒప్పుకోవడానికి ఇంత భయమా..
Gukesh Victory

తెలుగు బిడ్డ గుకేష్ దొమ్మరాజు చెస్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. తిరుగులేని ఆటగాడిగా మారిపోయాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్లను అవలీలగా ఓడిస్తున్నాడు. ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్‌ను ఒకసారి కాదు.. రెండు సార్లు ఓడించాడు. జులై మూడవ తేదీన జరిగిన సూపర్ యునైటెడ్ రాపిడ్ అండ్ బ్లిండ్జ్ టోర్నమెంట్‌లో కూడా మాగ్నస్‌ను చిత్తుచిత్తుగా గుకేష్ ఓడించాడు. మొదటి సారి ఓటమి పాలైన సమయంలో మాగ్నస్ తట్టుకోలేకపోయాడు. ఒకరకంగా పిచ్చివాడిలా మారిపోయాడు.


సూపర్ యునైటెడ్ రాపిడ్ అండ్ బ్లిండ్జ్ టోర్నమెంట్‌ ప్రారంభం అవ్వడానికి ముందు గుకేష్‌పై తన అక్కసు వెల్లగక్కాడు. మాగ్నస్ మీడియాతో మాట్లాడుతూ..‘టోర్నమెంట్‌లో అతడితో పోటీ పడుతుంటే.. ఓ బలహీనమైన ఆడగాడితో పోటీ పడుతున్నట్లు ఉంది’ అని అన్నాడు. టోర్నమెంట్‌లో ఓటమి తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. గుకేష్‌ను విమర్శించటం మానేశాడు. తనను తాను విమర్శించుకున్నాడు. మీడియాతో మాట్లాడుతూ... ‘గుకేష్ అద్భుతంగా ఆడుతున్నాడు.


వరుసగా ఐదు గేమ్స్ గెలవటం అన్నది మామూలు విషయం కాదు. నిజానికి.. ప్రస్తుతం నేను చెస్ ఆడటాన్ని అంతగా ఆస్వాధించలేకపోతున్నా. నేను అసలు ఆడుతున్నట్లుగా కూడా లేదు. చిరాకుగా ఉంది. నా పరిస్థితి ఇప్పుడు ఏం బాగోలేదు’ అని అన్నాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇండియన్ నెటిజన్స్ మాగ్నస్‌ను ఆడుకుంటున్నారు. ‘దెబ్బ అదుర్స్ కదూ.. బలహీనమైన ఆటగాడితో రెండు సార్లు ఎలా ఓడిపోయావు మాగ్నస్’..‘మాగ్నస్‌ను ఓడించడానికే గుకేష్ చెస్ ఆడుతున్నట్లు ఉంది.. సూపర్ ప్లేయర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

నువ్వసలు తల్లివేనా.. కొడుకును ఇంత దారుణంగా కొడతావా?..

Updated Date - Jul 05 , 2025 | 08:03 AM