Viral Video: నువ్వసలు తల్లివేనా.. కొడుకును ఇంత దారుణంగా కొడతావా?..
ABN , Publish Date - Jul 05 , 2025 | 06:39 AM
Viral Video: కరోలీకి చెందిన ఓ మహిళ టేబుల్ కింద పడ్డ స్పూన్‌ను తీసి పైన పెట్టమని కొడుక్కి చెప్పింది. ఆ పిల్లాడు ఆమె చెప్పిన పని చేయటం మర్చిపోయాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. పిల్లాడిపై దాడికి దిగింది.

ఏ తల్లైనా బిడ్డలకు ఏ చిన్న నొప్పి కలగకుండా చూసుకోవాలని అనుకుంటుంది. బిడ్డకు ఏదైనా అయితే తను విలవిల్లాడిపోతుంది. బిడ్డల ప్రాణాల కోసం తమ ప్రాణాలు బలివ్వడానికి సిద్ధమయ్యే తల్లులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. అయితే, కొంతమంది మాత్రం తల్లి అనే పదానికే కళంకం తెస్తున్నారు. కన్న బిడ్డలతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. తమ సుఖం కోసం నవ మాసాలు మోసి పెంచిన బిడ్డల్ని చంపుతున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా, ఓ తల్లి తన కుమారుడితో అత్యంత పాశవికంగా ప్రవర్తించింది.
వంట సామాన్లతో.. కాళ్లు చేతులతో చావగొట్టింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నా కూడా వదలిపెట్టలేదు. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్, కరౌలీలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, కరోలీకి చెందిన ఓ మహిళ టేబుల్ కింద పడ్డ స్పూన్‌ను తీసి పైన పెట్టమని కొడుక్కి చెప్పింది. ఆ పిల్లాడు ఆమె చెప్పిన పని చేయటం మర్చిపోయాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. పిల్లాడిపై దాడికి దిగింది. మొదటగా వంట సామాన్లతో అతడిపై దాడి చేసింది.
తర్వాత చేతితో,కాళితో కూడా కొట్టింది. పిల్లాడు ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు. ఆ ఇంటి సభ్యుడు ఒకడు దీన్నంతా వీడియో తీస్తూ ఉన్నాడు. ఆమెను ఆపేందుకు ప్రయత్నించాడు. కొట్టొద్దని అన్నాడు. ఇందుకు ఆ మహిళ..‘వాడు నా కొడుకు.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను’ అని అంది. ఆ వ్యక్తి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాడిని కొడుతున్నపుడు పక్కనే ఉన్న ఓ వ్యక్తిపై కూడా మండిపడుతున్నారు. ‘చిన్న పిల్లాడిని కొడుతుంటే రాయిలా కూర్చున్నావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తాలిబన్ సర్కారును గుర్తించిన రష్యా
వైసీపీ చెర నుంచి బి.తాండ్రపాడు చెరువుకు విముక్తి