Share News

Russia: తాలిబన్‌ సర్కారును గుర్తించిన రష్యా

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:26 AM

అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత తాలిబన్‌ సర్కారుకు గొప్ప విజయం దక్కింది. తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది.

Russia: తాలిబన్‌ సర్కారును గుర్తించిన రష్యా

మాస్కో, జూలై 4: అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత తాలిబన్‌ సర్కారుకు గొప్ప విజయం దక్కింది. తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు తాలిబన్‌ సర్కారును అధికారికంగా ఏ దేశం గుర్తించకపోవడంతో అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.


తాలిబన్లు నియమించిన అఫ్గాన్‌ రాయబారి గుల్‌ హసన్‌ హసన్‌ను అనుమతిస్తూ అర్హత పత్రాలు అందజేసినట్లు రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ అఫ్గాన్‌ సర్కారుకు అధికారిక గుర్తింపు లభించడంతో ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో నిర్మాణాత్మక ద్వైపాక్షిక సహకారం పెరుగుతుందని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొంది.

Updated Date - Jul 05 , 2025 | 05:26 AM