England Worst Record: ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టీమిండియాతో పెట్టుకుంటే ఇట్లుంటది!
ABN , Publish Date - Jul 05 , 2025 | 08:28 AM
ఇంగ్లండ్ జట్టు ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. టెస్ట్ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరి.. స్టోక్స్ సేన సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఎదురీదుతోంది ఇంగ్లండ్. తొలుత బౌలింగ్‌లో విఫలమైన ఆ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184) పోరాటంతో కోలుకున్న ఆతిథ్య జట్టు.. భారత్‌ను భయపెట్టింది. కానీ పర్యాటక జట్టు పేసర్లు చెలరేగడంతో టీమిండియా స్కోరుకు 180 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది ఇంగ్లండ్. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఏకంగా ఆరుగురు బ్యాటర్లు..!
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లండ్. బ్రూక్, స్మిత్ రాణించినా టాపార్డర్‌తో పాటు మిడిల్, లోయరార్డర్‌లో పలువురు బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. ఏకంగా ఆరుగురు డకౌట్ అవడం గమనార్హం. ఓపెనర్ బెన్ డకెట్, ఓలీ పోప్‌తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. తద్వారా చెత్త రికార్డును మూటగట్టుకుంది. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 400 ప్లస్ స్కోరు చేసిన జట్టులో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 64 పరుగులతో ఉంది. టీమిండియా ఆధిక్యం 244 పరుగులకు చేరుకుంది. కేఎల్ రాహుల్ (28 నాటౌట్), కరుణ్ నాయర్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

ఇవీ చదవండి:
ఓటమి ఒప్పుకోవడానికి ఇంత భయమా..
బంగ్లాదేశ్‌లో భారత పర్యటన లేనట్టే
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి